Liam Crowley : జై బాబు అన్న హాలీవుడ్ రిపోర్టర్.. వారణాసి టీమ్ ని ఇంటర్వ్యూ చేసిన ఇతను ఎవరో తెలుసా?
హాలీవుడ్ లో వారణాసి మూవీ టీమ్ ఇచ్చిన పలు ఇంటర్వ్యూలు నిన్న రిలీజయిన సంగతి తెలిసిందే.(Liam Crowley)
Liam Crowley
Liam Crowley : RRR సినిమాతో ఆస్కార్ సాధించి హాలీవుడ్ లో ఫేమ్ రావడంతో రాజమౌళి తన నెక్స్ట్ సినిమా వారణాసిని హాలీవుడ్ టార్గెట్ పెట్టుకొని రిలీజ్ చేస్తున్నాడు. దీంతో రాజమౌళి వారణాసి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హాలీవుడ్ లో కూడా ప్రమోషన్స్ చేస్తున్నాడు. హాలీవుడ్ లో వారణాసి మూవీ టీమ్ ఇచ్చిన పలు ఇంటర్వ్యూలు నిన్న రిలీజయిన సంగతి తెలిసిందే.(Liam Crowley)
వీటిల్లో స్క్రీన్ రాంట్ యూట్యూబ్ ఛానల్ లో వచ్చిన ఇంటర్వ్యూ బాగా వైరల్ గా మారింది. ఇందులో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి హాలీవుడ్ రిపోర్టర్ లియాం క్రౌలికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో హోస్ట్ లియాం క్రౌలి మహేష్ బాబుని అభిమానులు పిలిచే స్లోగన్ తో జై బాబు అనడం, ఇండియాలో మహేష్ ఫ్యాన్ డమ్ గురించి మాట్లాడటంతో మహేష్ ఫ్యాన్స్ ఈ ఇంటర్వ్యూని వైరల్ చేస్తున్నారు.
Also See : Vithika Sheru : భర్త వరుణ్ సందేశ్ తో కలిసి నటి వితిక షేరు బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు..
అంతే కాకుండా ముగ్గురితో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి అక్కడ కూడా జై బాబు అని పోస్ట్ చేసాడు లియాం క్రౌలి. దీంతో లియాం క్రౌలి టాలీవుడ్ లో వైరల్ గా మారాడు.
న్యూయార్క్ కి చెందిన లియాం క్రౌలి జర్నలిజం మాస్ కమ్యూనికేషన్స్ చేసి రిపోర్టర్, హోస్ట్ గా మారాడు. హాలీవుడ్ లో అనేకమంది సెలబ్రిటీలను ఇప్పటికే లియాం క్రౌలి ఇంటర్వ్యూ చేసాడు. స్క్రీన్ రాంట్ అనే పేరుతో సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఫేమ్ తెచ్చుకున్నాడు. అలాగే కాఫీ చాట్స్ అనే ప్రోగ్రాంతో న్యూయార్క్ లో ఉన్న కేఫ్స్ లో సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసాడు.
Also Read : Varanasi : అక్కడ షూటింగ్ చేయబోయే మొదటి ఇండియన్ సినిమా.. ‘వారణాసి’తో సరికొత్త రికార్డ్..
లియాం క్రౌలి తో పాటు మరో రెండు హాలీవుడ్ యూట్యూబ్ ఛానల్స్ కి వారణాసి టీమ్ ఇంటర్వ్యూ ఇచ్చింది. మొత్తానికి మహేష్ హాలీవుడ్ ప్రమోషన్స్ తో అక్కడి రిపోర్టర్స్ కూడా ఇక్కడ ఫేమ్ తెచ్చుకుంటున్నారు. సినిమా రిలీజ్ సమయానికి వారణాసి టీమ్ హాలీవుడ్ లో ఇంకెన్ని ఇంటర్వ్యూలు ఇస్తుందో చూడాలి.
లియాం క్రౌలి వారణాసి టీమ్ తో చేసిన ఇంటర్వ్యూ ఇక్కడ చూసేయండి..
