Maa Inti Bangaram : సమంత మా ఇంటి బంగారం ఏ ఓటీటీలోకి వస్తుందో తెలుసా?
సమంత 'మా ఇంటి బంగారం' ఏ ఓటీటీలోకి వస్తుందా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Do you know Samantha maa inti bagaram in which OTT
Maa Inti Bangaram : సమంత ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘మా ఇంటి బంగారం’. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు (శుక్రవారం జూన్ 19న) ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పలు చోట్ల ప్రీమియర్ షోలు పడగా మంచి స్పందన వస్తోంది. ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై స్వయంగా సమంత ఈ మూవీని నిర్మించింది.
ప్రముఖ దర్శకుడు, సమంత భర్త రాజ్ నిడిమోరు ఈ మూవీకి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. ఓ బేబీ చిత్రం తరువాత సమంత, నందిని రెడ్డి కాంబినేషన్లో రూపుదిద్దుకోవడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
Divi : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి దివి
ఇదిలా ఉంటే.. ఈ చిత్రం ఏ ఓటీటీలోకి వస్తుంది అనే దానిపై సర్వత్రా ఆసక్తి ఉంది. ఇప్పుడు ఆ విషయం తెలిసిపోయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని టైటిల్ కార్డులో మూవీ యూనిట్ తెలిపింది.
ఇక ఈ చిత్రం విడుదలైన నెల రోజుల తరువాతనే జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
