Coincidence : ఆ నలుగురు.. చివరి సినిమాల్లో ఒకేలా నవ్వుతూ..

  • Publish Date - June 15, 2020 / 07:37 AM IST

సినిమా హీరోగా ఎదగటానికి ముందు ఎన్ని కష్టాలు పడ్డాడో.. జీవితాన్ని ఎదర్కోలేక 34ఏళ్లకే ఆత్మహత్య చేసుకున్నాడు యంగ్ హీరో సుశాంత్ రాజ్‌పూత్. చిన్న చిన్న టీవీ ప్రోగ్రాంల నుంచి సీరియళ్లు.. సూపర్ హిట్ సినిమాల వరకూ తన ప్రస్థానం గట్టిదే.

కానీ, కొద్దినెలలుగా డిప్రెషన్‌లో ఉన్న సుశాంత్.. ఒంటరిగా.. వైరాగ్యంతో ఈ లోకం వదిలి వెళ్లిపోయాడు. అయితే బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మ‌ర‌ణాన్ని జీర్ణించుకోవ‌డం అభిమానులకు, సినీ జ‌నాల‌కు చాలా క‌ష్టంగానే ఉంది. అయితే సినిమా ఇండస్ట్రీ వరకు అయితే బాలీవుడ్‌కు మాత్రమే సుశాంత్ పరిమితం.

అయితే ధోనీ బయోపిక్ చెయ్యడం కారణంగా సుశాంత్ ప్రపంచం అంతా పరిచయం అయ్యాడు. భారత్‌లో రీల్ ధోనీని ఓన్ చేసుకున్నారు సినిమా ప్రేక్షకులు. దీంతో సోషల్ మీడియాలో పోస్ట్‌లు అన్నీ సుశాంత్ గురించే.. లేటెస్ట్‌గా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

చివ‌ర‌గా థియేట‌ర్ల‌లో రిలీజైన సుశాంత్ సినిమా చిచ్చోరేలో ఒక సీన్‌లో సుశాంత్ కార్‌లో ప్ర‌యాణిస్తూ బ‌య‌టికి త‌ల‌పెట్టి ఆకాశం వైపు చూసే దృశ్యం ఉంటుంది. ఆ దృశ్యం చాలా హృద్యంగా, ఆహ్లాదంగా అనిపిస్తుంది. కొన్ని నెల‌ల కింద‌టే క్యాన్స‌ర్‌తో చ‌నిపోయిన ఇర్ఫాన్ ఖాన్ సైతం అంగ్రేజీ మీడియంలో ఒక చోట కార్‌లో నుంచి బ‌య‌టికి త‌ల‌పెట్టి ఆకాశం వైపు చూసే దృశ్యం ఉంటుంది.

వీళ్లిద్ద‌రే కాదు.. డార్క్ నైట్ సినిమాలో జోక‌ర్ పాత్ర‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎన‌లేని పేరు సంపాదించిన హీత్ లెడ్జ‌ర్ సైతం ఆ సినిమాలో ఒక స‌న్నివేశంలో కారు బ‌య‌ట త‌ల‌పెట్టి ఆకాశం వైపు చూసే స‌న్నివేశం ఉంటుంది. అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌ హీత్ లెడ్జ‌ర్ ఒక మందు డోస్ ఎక్కువ‌గా వేసుకోవ‌డం వ‌ల్ల 2008లో చనిపోయాడు. అతడి వ‌య‌సు 28 ఏళ్లే.

ఇక తెలుగు సినిమా దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు కూడా అదే మాదిరిగా “మనం” సినిమాలో ఒక సీన్‌లో కారులో నుంచి బయటకు పెట్టి ఉంటాడు. సుశాంత్‌, ఇర్ఫాన్‌, హీత్, నాగేశ్వరరావులు చ‌నిపోవ‌డం.. వాళ్ల చివ‌రి సినిమాల్లో ఒకే త‌ర‌హా స‌న్నివేశాల్లో క‌నిపించ‌డంతో ఈ కోయిన్సిడెన్స్ అంటూ ట్విట్ట‌ర్లో చ‌ర్చ జ‌రుగుతోంది.