Gabbar Singh Ramesh : గబ్బర్ సింగ్ ఫేమ్ నటుడు రమేష్ కు బ్రెయిన్ స్ట్రోక్.. రెండు రోజుల ముందు కూడా షూటింగ్ లో..
అకస్మాత్తుగా అనారోగ్య సమస్యతో రమేష్ అపోలో హాస్పిటల్ లో చేరారు. (Gabbar Singh Ramesh)
Gabbar Singh Ramesh
Gabbar Singh Ramesh : గబ్బర్ సింగ్ సినిమాలో అంత్యాక్షరి సీన్ తో చాలా మంది నటులు ఒక్కసారిగా ఫేమ్ తెచ్చుకున్నారు. అందులో రమేష్ ఒకరు. గబ్బర్ సింగ్ సినిమాతో రమేష్ కి మంచి ఫేమ్ రావడంతో ఆ తర్వాత నటుడిగా, కమెడియన్ గా అనేక సినిమల్లో నటించాడు. రెగ్యులర్ గా ఏదో ఒక సినిమాలో చిన్న చిన్న పాత్రల్లో కనిపిస్తున్నారు.
రమేష్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ పోస్టులు పెడతాడు. రెండు రోజుల క్రితమే షూటింగ్ లొకేషన్ నుంచి ఓ వీడియోని కూడా షేర్ చేసాడు. అయితే తాజాగా రమేష్ కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని సమాచారం. అకస్మాత్తుగా అనారోగ్య సమస్యతో రమేష్ అపోలో హాస్పిటల్ లో చేరారు. అతనికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని గుర్తించిన వైద్యులు చికిత్స చేస్తున్నారు. సమస్య సీరియస్ గా ఉందని, పరిస్థితి విషమమే అని హాస్పిటల్ వైద్యులు చెప్పినట్టు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది.
Also Read : Racha Ravi : జబర్దస్త్ కమెడియన్ రచ్చరవి ఫ్యామిలీ ఫోటోలు చూశారా..?
దీంతో రమేష్ తో కలిసి పనిచేసే నటులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆయన కోలుకోవాలని కోరుకుంటున్నారు.
