×
Ad

ఇజా లవర్ ఆఫ్ గౌతమ్ – ‘వరల్డ్ ఫేమస్ లవర్’

'వరల్డ్ ఫేమస్ లవర్' - విజయ్ దేవరకొండ ప్రేయసిగా ఇజా బెల్లె లెయితె..

  • Published On : December 14, 2019 / 10:29 AM IST

‘వరల్డ్ ఫేమస్ లవర్’ – విజయ్ దేవరకొండ ప్రేయసిగా ఇజా బెల్లె లెయితె..

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటిస్తున్న లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ (World Famous Lover).. 
సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కయర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ నిర్మిస్తున్నారు.

 

రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్, ఎజిబెల్లా, క్యాథరీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. చిత్రంలో విజయ్ దేవరకొండ పాత్ర పేరు శీనయ్య. విజయ్ దేవరకొండభార్య సువర్ణపాత్రలో ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నారు. తాజాగా ఇజాబెల్లె లెయితె లుక్‌ను విడుద‌ల చేశారు. ఇజా అనే పాత్ర‌లో న‌టిస్తోన్న ఇజా బెల్లె లెయితె ఫ్రాన్స్‌లో ఉంటుంది.

ఫ్రాన్స్‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఉన్న క‌నెక్ష‌న్ ఏంట‌నేది ఆసక్తికరంగా అనిపిస్తోంది. ఐశ్వ‌ర్య రాజేశ్‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ ఉన్న పోస్ట‌ర్‌కు ఇది భిన్నంగా ఉంది. ఇందులో ఇజాబెల్లె విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను గౌత‌మ్ అని సంబోధిస్తుంది. ఈ సినిమా టీజర్ జనవరి 3న విడుదల చేస్తున్నారు. వేలంటైన్స్ డే సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 14న విడుద‌ల చేయనున్నారు.
కెమెరా : జయకృష్ణ గుమ్మడి, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు, సంగీతం : గోపి సుందర్, ఆర్ట్ : సాహి సురేష్.