Bhimaa Trailer : గోపీచంద్ మాస్ యాక్షన్ మూవీ ‘భీమా’ ట్రైలర్ వచ్చేసింది..

మ్యాచో స్టార్ గోపీచంద్ కన్నడ స్టార్ డైరెక్టర్ హర్ష దర్శకత్వంలో నటిస్తున్న 'భీమా' ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

Bhimaa Trailer : గోపీచంద్ మాస్ యాక్షన్ మూవీ ‘భీమా’ ట్రైలర్ వచ్చేసింది..

Gopichand Priyabhawani Shankar Malavika Sharma Bhimaa Trailer Released

Bhimaa Trailer : ఒక పవర్ ఫుల్ కమ్‌బ్యాక్ కోసం చూస్తున్న గోపీచంద్.. కన్నడ మాస్ డైరెక్టర్ హర్ష దర్శకత్వంలో చేస్తున్న పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘భీమా’. ఈ సినిమాలో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. హర్ష దర్శకత్వంలో హీరోలు చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తుంటారు. అలాంటి దర్శకుడు గోపీచంద్ వంటి హీరోతో సినిమా చేస్తుంటే.. ఆడియన్స్ లో ఓ రేంజ్ అంచనాలు ఉండడం సహజం.

ఇప్పటికే ఈ మూవీ నుంచి సాంగ్స్ అండ్ టీజర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. కేవలం చిన్న టీజర్‌తోనే దర్శకుడు హర్ష ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేశారు. ఇప్పుడు ఆ అంచనాలను మరింత పెంచడానికి ట్రైలర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేశారు. ఆ ట్రైలర్ వైపు ఓ లుక్ వేసేయండి.

Also read : Sundeep Kishan : మీమర్ పై సందీప్ కిషన్ ఆగ్రహం.. హీరోయిన్స్‌ గురించి మరి అంత చీప్‌గా..

ఈ మూవీలో ప్రియభావాని శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీసత్య సాయి ఆర్ట్స్ నిర్మాణంలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఫిబ్రవరిలోనే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం పోస్టుపోన్ అయ్యి మార్చి 8కి వచ్చింది. శివరాత్రి సందర్భంగా ఈ చిత్రాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు.