Devi Sri Prasad : చెర్రీతో సుక్కు మూవీకి దేవిశ్రీ మ్యూజిక్..!
పెద్ది తర్వాత రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో ఓ మూవీకి సెట్స్ మీదకు వెళ్లబోతోంది. ఈ ప్రాజెక్ట్‌కు మ్యూజిక్ డైరెక్ట్‌గా మళ్లీ దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad) పేరే బలంగా వినిపిస్తోంది.
Gossip Garage is Devi Sri prasad music for the movie charan sukumar movie
Devi Sri Prasad : డైరెక్టర్‌గా సుకుమార్ అన్ని సినిమాలకు మ్యూజిక్ అందించింది డీఎస్పీనే ! ఇద్దరి కాంబోలో ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ వచ్చాయి. పుష్క ఫ్రాంచైజీ అయితే.. ఇండియావైడ్‌గా మ్యూజిక్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఐతే పుష్ప 2 టైమ్‌లో ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని ఇండస్ట్రీలో టాక్ వినిపించింది.
ఐతే అదంతా ఉట్టి గాసిప్పే అని ఇప్పుడు తేలిపోయింది. పెద్ది తర్వాత రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో ఓ మూవీకి సెట్స్ మీదకు వెళ్లబోతోంది. ఈ ప్రాజెక్ట్‌కు మ్యూజిక్ డైరెక్ట్‌గా మళ్లీ దేవిశ్రీప్రసాద్ పేరే బలంగా వినిపిస్తోంది. పెద్ది సినిమాకు రెహమాన్ మ్యూజిక్ ఇచ్చినప్పటికీ.. ఆ ఆల్బమ్ అంచనాలకు తగ్గ రీచ్ సాధించలేదనే ఓపీనియన్ ఇండస్ట్రీలో ఉంది.
దీంతో సుకుమార్ కూడా.. తన టేస్ట్‌కు సరిపోయే.. వైబ్‌తో మ్యాచ్ అయ్యే దేవిశ్రీప్రసాద్‌తోనే మళ్లీ పని చేయాలని డిసైడ్ అయ్యాడని టాక్. గతంలో ఎనర్జిటిక్ మ్యూజిక్, చార్ట్‌బస్టర్ సాంగ్స్‌తో ఊపు ఊపిన ఈ కాంబో.. మళ్లీ ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయాలని ఫిక్స్ అయిందట. దీంతో చెర్రీ, సుక్కు, రాక్ స్టార్ మూవీపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.
