RC17 : సుకుమార్ – దేవిశ్రీ ప్రసాద్ కాంబోకి బ్రేక్?
సుకుమార్ సినిమాలకు సంగీతం అందించే దేవిశ్రీప్రసాద్ RC17 ప్రాజెక్టులో ఉంటారా? లేక కొత్త సంగీత దర్శకుడికి అవకాశం ఇస్తారా? అనే చర్చ మొదలైంది.
Gossip Garage Is Devi Sri Prasad out of Ram Charan RC17
RC17 : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న RC17 సినిమా లాంచింగ్‌కు ముందే హైప్ క్రియేట్ అవుతోంది. రంగస్థలం వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ ఇద్దరూ మరోసారి కలిసి పనిచేయనుండటంతో, ఈ సినిమా కథ, నటీనటులు, టెక్నికల్ టీమ్‌తో పాటు ప్రతీ అంశంపై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది.
అయితే సుకుమార్ సినిమాలకు సంగీతం అందించే దేవిశ్రీప్రసాద్ ఈ ప్రాజెక్టులో ఉంటారా? లేక కొత్త సంగీత దర్శకుడికి అవకాశం ఇస్తారా? అనే చర్చ మొదలైంది. గతంలో సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో వచ్చిన పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆడియన్స్‌ను ఎంతో మెప్పించింది. అందుకే RC17 మ్యూజిక్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
Meenaakshi Chaudhary : వెకేషన్లో మీనాక్షి చౌదరి.. ఫోటోలు వైరల్..
RC17 కోసం సుకుమార్.. దేవిశ్రీ ప్రసాద్‌తో కలిసి పనిచేయడానికి అంతగా ఆసక్తి చూపడం లేదనే ప్రచారం వినిపిస్తోంది. ఈ సారి సినిమా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో సుకుమార్ మరో ఆప్షన్‌ను పరిశీలిస్తున్నారా.? కథకు తగ్గట్టుగా కొత్త సంగీత దర్శకుడితో ప్రయోగం చేయాలని భావిస్తున్నారా.? అనే ప్రశ్నలు ఫిల్మ్ సర్కిల్స్‌లో చర్చకు దారితీస్తున్నాయి.
అయితే దేవిశ్రీ ప్రసాద్‌ను సుకుమార్ వద్దనుకుంటున్నారనే టాక్ జస్ట్ రూమర్‌గా చెబుతున్నారు. అయితే RC17 మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనే దానిపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. దీంతో ఈ కాంబినేషన్లో మరోసారి దేవిశ్రీ మ్యాజిక్ కనిపిస్తుందా.? లేక సుకుమార్ కొత్త నిర్ణయం తీసుకుంటారా.? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
