#HBDKingNagarjuna: కింగ్ నాగార్జున సెప్టెంబర్ 29న తన 61వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. సిక్స్టీలోనూ ట్వంటీ ప్లస్‌లా కనబడడం అక్కినేని అందగాడికే సాధ్యం అని కొత్తగా చెప్పనవసరం లేదు. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ‘విక్రమ్’ సినిమాతో హీరోగా పరిచయం అయిన నాగార్జున.. అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఓ ఇమేజ్ను, ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు.
కెరీర్ స్టార్టింగ్‌లో మాస్ సినిమాలు, ఫ్యామిలీ సినిమాలు, ప్రేమకథలు చేసినా.. ఏ ఒక్క జానర్‌కు ఫిక్స్ కాకుండా, ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా.. వైవిధ్య భరితమైన కథలను ఎంచుకుంటూ, నటనకు ఆస్కారమున్న పాత్రలు చేస్తూ అసలు సిసలు అక్కినేని నట వారసుడిగా ప్రేక్షకాభిమానుల ఆదరాభిమానాలు చూరగొన్నారు.
https://10tv.in/c-u-soon-releasing-on-1st-september/
తన సినిమాకు తానే న్యాయనిర్ణేత.. సినిమా నచ్చకపోతే చూడొద్దు అంటూ అభిమానులకు మొహమాటం లేకుండా చెప్పే హీరో నాగ్ ఒక్కరే.. ఆయన చేసిన ప్రయోగాలు అనేకం, ఆయన కీర్తి అనంతం.. నాగ్ పరిచయం చేసినంతమంది దర్శకులను తెలుగు సినిమా పరిశ్రమలో ఏ హీరో కూడా ఇంట్రడ్యూస్ చేసిఉండరు. వయసు పెరిగినా వన్నె తరగని నిత్య యవ్వనుడు, ప్రేక్షకుల మనసులు దోచుకున్న “మన్మథుడు”.. అమ్మాయిల్ని కలలో కవ్వించే “గ్రీకువీరుడు”.. అందంతో ఆడాళ్ళని అసూయ పడేలా చేసిన రాకుమారుడు.. అక్కినేని అందగాడు.. సినీ సామ్రాజ్యానికి “కింగ్” ఆయన..
సినిమాల విషయానికొస్తే “వైల్డ్ డాగ్”(Wild Dog), “సోగ్గాడే చిన్నినాయనా” ప్రీక్వెల్ “బంగార్రాజు”తో పాటు ఇటీవల ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలోనూ ఓ సినిమా కమిట్ అయ్యారు. అలాగే వరుసగా రెండోసారి అతిపెద్ద రియాలిటీ షో “బిగ్‌బాస్-4″కి వ్యాఖ్యతగా వ్యవహరించనున్నారు కింగ్ నాగార్జున.