Keerthy Suresh : హ్యాపీ బర్త్‌డే కీర్తి సురేష్
మోస్ట్ టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ కీర్తి సురేష్ తన 30వ పుట్టినరోజు జరుపుకుంటుంది..
- sekhar
- Published on- October 17, 2021 / 12:22 PM IST
Keerthy Suresh
Keerthy Suresh: ‘మహానటి’ చిత్రంతో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్ అందుకున్న నేచురల్ యాక్ట్రెస్ కీర్తి సురేష్ పుట్టినరోజు నేడు (అక్టోబర్ 17).. ఈ సందర్భంగా పలువురు టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇది కీర్తి 30వ బర్త్‌డే. ఈ స్పెషల్ డే నాడు కీర్తికి శుభాకాంక్షలు చెబుతూ కొత్త సినిమా పోస్టర్స్ రిలీజ్ చేశారు మేకర్స్.
YASH : రాకింగ్ స్టార్ ‘రోలెక్స్’ వాచ్ రేటెంతో తెలుసా
మెగాస్టార్ చిరంజీవి-మెహర్ రమేష్ కాంబినేషన్‌లో తమిళ్ సూపర్ హిట్ ‘వేదాళం’ రీమేక్‌గా తెరకెక్కుతున్న సినిమా ‘భోళా శంకర్’. కీర్తి సురేష్, చిరు చెల్లెలుగా నటిస్తోంది. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ కీర్తి ట్రెడిషనల్ పోస్టర్ రిలీజ్ చేశారు.
సూపర్‌స్టార్ మహేష్ బాబు, పరశురామ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో కీర్తి హీరోయిన్‌గా నటిస్తోంది. మూవీ టీమ్ కీర్తికి విషెస్ తెలియచేస్తూ కీర్తి గ్లామరస్ లుక్ వదిలారు.
కీర్తి సురేష్‌లో ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘గుడ్ లక్ సఖి’ మూవీ నుంచి కూడా బర్త్‌డే పోస్టర్ విడుదల చేశారు. జాతీయ అవార్డు గ్రహీత నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో కీర్తి సురేశ్ రైఫిల్ షూటర్‌గా కనిపించనున్నారు. ఓ పల్లెటూరిలో అందరూ దురదృష్టానికి చిహ్నంగా భావించే ఓ అమ్మాయి ఎలా జాతీయస్థాయి రైఫిల్ షూటర్‌గా ఎదిగిందనే కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. జగపతిబాబు ఇందులో రైఫిల్ షూట్ కోచ్ పాత్రలో కనిపించనున్నారు.
