Harika Narayan : ఏడేళ్ల ప్రేమ.. నిశ్చితార్థం చేసుకున్న బ్యూటిఫుల్ సింగర్..

హారిక నారాయణ్ గత ఏడేళ్లుగా ఓ అబ్బాయిని ప్రేమిస్తుంది. తాజాగా వీళ్ళు నిశ్చితార్థం చేసుకున్నారు.

Harika Narayan : ఏడేళ్ల ప్రేమ.. నిశ్చితార్థం చేసుకున్న బ్యూటిఫుల్ సింగర్..

Harika Narayan Engaged with her Lover Prudhvinath Vempati

Harika Narayan : తెలుగు బ్యూటిఫుల్ సింగర్స్ లో హారిక నారాయణ్ ఒకరు. తెలుగు, తమిళ్ లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడిన ఈ భామ సినిమాల్లో సాంగ్స్ తో మెప్పిస్తునే టీవీ షోలలో, ప్రైవేట్ ఆల్బమ్స్ తో కూడా తన పాటలతో మెప్పిస్తుంది. అలాగే సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటూ తన పాటలతోనే కాక, తన అందంతో కూడా అభిమానులని సంపాదించుకుంది. తాజాగా ఈ భామ నిశ్చితార్థం చేసుకుంది.

హారిక నారాయణ్ గత ఏడేళ్లుగా ఓ అబ్బాయిని ప్రేమిస్తుంది. పృథ్వినాథ్ వెంపటి అనే వ్యక్తితో హారిక ప్రేమలో ఉంది. తాజాగా వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారు. నిశ్చితార్థంకి సంబంధించిన ఫోటో ఒకటి తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఏడేళ్ల నుంచి మనది అద్భుతమైన అనుబంధం. దీనిని అధికారికంగా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తున్నాం. కొత్త అనుబంధాన్ని మరింత కొత్తగా మొదలుపెడదాం అని స్పెషల్ పోస్ట్ చేసింది. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతుందని సమాచారం.

Also Read : Kriti Kharbanda : పెళ్లిపీటలు ఎక్కబోతున్న పవన్ హీరోయిన్.. ప్రియుడితో ఆ రోజే పెళ్లి..

ఇక హారిక నారాయణ్ – పృథ్వినాథ్ చదువుకునేటప్పటినుంచే ప్రేమలో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అతను విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నట్టు సమాచారం. తాజాగా నిశ్చితార్థం చేసుకోవడంతో ఈ జంటకు పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

View this post on Instagram

A post shared by Harika Narayan (@harika_narayan)