Hyper Aadi : ‘జన నాయగన్’ రిలీజ్ వేళ.. విజయ్, త్రిషపై హైపర్ ఆది కామెంట్స్..
ఇటీవల ఆ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేసారు. (Hyper Aadi)
Hyper Aadi
Hyper Aadi : తమిళ్ స్టార్ హీరో, ప్రస్తుతం తమిళనాడు సీఎం విజయ్ లాస్ట్ సినిమా జననాయగన్ తాజాగా జులై 23న థియేటర్స్ లో రిలీజయింది. తమిళ్ లో ఈ సినిమా ఫ్యాన్స్ ని మెప్పించినా తెలుగులో మాత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. గత కొన్నాళ్లుగా విజయ్ – త్రిష బంధం వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా జన నాయగన్ సినిమా రిలీజ్ వేళ హైపర్ ఆది చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
జబర్దస్త్ తో ఫేమ్ తెచ్చుకున్న హైపర్ ఆది ఇప్పుడు సినిమాలతో బిజీ అయ్యాడు. చాన్నాళ్ల తర్వాత జబర్దస్త్ కి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల ఆ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేసారు.
Also Read : Hey Chikitha Review : ‘హే చికీతా’ మూవీ రివ్యూ.. పవనిజం అంటూ తిరిగే యూత్..
ఈ ప్రోమోలో హైపర్ ఆది యాంకర్ రష్మీని ఉద్దేశించి మాట్లాడుతూ.. నీ పనే బాగుంది విజయ్ గారు కష్టపడి గెలిచి సీఎం అయితే త్రిష గారు చెయ్యి ఊపినట్టు మేమంతా కష్టపడి స్కిట్స్ చేస్తుంటే నువ్వు హాయ్ అని జస్ట్ చెయ్యి ఊపితే చాలు అయిపోతుంది అని అన్నారు. దీంతో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.
