IBomma: సినీ ఇండస్ట్రీకి బిగ్ షాక్.. మళ్లీ వచ్చేసిన ‘ఐబొమ్మ’.. లిస్టులో కొత్త సినిమాలు
మళ్ళీ యాక్టివేట్ అయిన ఐబొమ్మ(IBomma) వెబ్ సైట్. కొత్త కొత్త సినిమాలు అన్నీ టెలికాస్ట్ అవుతున్నాయి.
iBomma website activated again new movie playiing
- మళ్ళీ వచ్చిన ఐబొమ్మ పైరసీ.
- కొత్త సినిమాలు ఆన్లైన్లో ప్రత్యక్షం.
- ఆందోళనలో తెలుగు చిత్ర పరిశ్రమ.
IBomma: తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పైరసీ రూపంలో మరోసారి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గతంలో టాలీవుడ్‌ను వణికించిన ‘ఐబొమ్మ’ (iBomma) వెబ్సైట్ మళ్లీ యాక్టివ్ కావడంతో చిత్ర పరిశ్రమ వర్గాల్లో ఆందోళన మొదలైంది. ఒకానొక దశలో ఈ సైట్ నిర్వాహకుడు రవి అరెస్ట్ కావడంతో ఈ పైరసీ పీడ వదిలిందని అంతా భావించారు. కానీ, ఇప్పుడు తాజాగా థియేటర్లలో విడుదలైన కొత్త సినిమాలన్నీ హెచ్డీ క్వాలిటీతో ఈ వెబ్సైట్లో ప్రత్యక్షమవుతుండటం సినీ పెద్దలను షాక్‌కు గురి చేస్తోంది.
Sravanthi chokkarapu: ఎర్ర గులాబీలా స్రవంతి చొక్కారపు.. రెడ్ డ్రెస్సులో క్యూట్ లుక్స్ వైరల్
నిజానికి ఐబొమ్మ(IBomma) యాజమాన్యం గతంలోనే తమ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయినప్పటికీ, కొత్త డొమైన్లతో ఈ సైట్ మళ్ళీ పుట్టుకొస్తూనే ఉంది. కేవలం సినిమాలనే కాకుండా, ఓటీటీ కంటెంట్‌ను కూడా ఉచితంగా అందుబాటులో ఉంచడం వల్ల సామాన్య ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గుతోంది. దీనివల్ల నిర్మాతలు కోట్లాది రూపాయల నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది. సాంకేతికపరంగా ఈ సైట్‌ను అడ్డుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా, కొత్త లింకులతో ఇది వినియోగదారులకు చేరువవుతూనే ఉంది.
ఈ పరిణామాల నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు మరియు యాంటీ పైరసీ సెల్ అప్రమత్తమయ్యారు. సినిమా షూటింగ్ కోసం ఎంతో మంది కార్మికులు, పెట్టుబడిదారులు పడే కష్టాన్ని ఈ పైరసీ వెబ్సైట్లు అడ్డంగా దోచుకుంటున్నాయని టాలీవుడ్ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రేక్షకుల్లో అవగాహన పెరగాలని, పైరసీని ప్రోత్సహించకుండా థియేటర్లలోనే సినిమాలు చూడాలని సినీ ఇండస్ట్రీ విజ్ఞప్తి చేస్తోంది. ఐబొమ్మ వంటి సైట్ల వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను శాశ్వతంగా రూపుమాపేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.
