‘బ్రదర్’ అని పిలవండి.. అలాగే ‘బ్రదర్’.. కేటీఆర్, పవన్ మధ్య ఆసక్తికర సంభాషణ..
కేటీఆర్, పవన్ కళ్యాణ్‌ల మధ్య ఆసక్తికర సంభాషణ..
- sekhar
- Published On : March 26, 2020 / 04:22 PM IST
కేటీఆర్, పవన్ కళ్యాణ్‌ల మధ్య ఆసక్తికర సంభాషణ..
సోషల్ మీడియా (ట్విట్టర్)లో తెలంగాణ మినిస్టర్ కేటీఆర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. ‘‘నన్ను సార్ అని పిలవవద్దు.. ఎప్పటిలాగే బ్రదర్ అని పిలవండి అన్నా’’ అని తెలంగాణ మంత్రి కేటీఆర్.. జనసేనాని, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ను రిక్వెస్ట్ చేశారు.
కరోనా వైరస్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలుపుతూ.. తన వంతు సాయంగా రెండు తెలుగు రాష్ట్రాలకు 50 లక్షలు చొప్పున రూ. కోటి, కేంద్ర ప్రభుత్వానికి రూ. కోటి (మొత్తం 2 కోట్లు) పవన్ విరాళం ఇచ్చారు. పవన్ మద్దతుకు కేటీఆర్ స్పందిస్తూ.. ‘గొప్ప సందేశమిచ్చారు.. అన్నా..’ అని రిప్లయ్ ఇచ్చారు.
కేటీఆర్ రిప్లయ్ చూసిన పవన్ ‘‘ధన్యవాదాలు సార్.. ఇలాంటి అల్లకల్లోల సమయాల్లో శ్రీ కె.సి.ఆర్ గారి నాయకత్వంలో, ప్రశంసనీయంగా నడుచుకుంటున్న మీ తీరుకు హృదయపూర్వక అభినందనలు. ఆదర్శంగా నిలుస్తున్నారు’’ అని మరో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు రిప్లయ్ ఇచ్చిన కేటీఆర్.. ‘‘ధన్యవాదాలు అన్నా.. ఎప్పటి నుంచి ఇలా సార్ అని పిలవడం మొదలెట్టారు? దయచేసి ఎప్పటిలాగే బ్రదర్ అని పిలవండి’’ అని విన్నవించారు. దీనికి వెంటనే పవన్.. ‘అలాగే బ్రదర్’ అని రిప్లయ్ ఇచ్చారు. కేటీఆర్, పవన్ మధ్య జరిగిన ఈ సంభాషణ తాలుకు ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Thanks Anna ?
Since when did you start calling me sir! Always a brother pls! https://t.co/XpKqTZNOxZ
— KTR (@KTRTRS) March 26, 2020
