నా స్నేహితుడు అజిత్‌ను ఫాలో అయ్యా.. మన హీరోలు ఇలా ఎందుకుండరబ్బా..
దళపతి విజయ్ ‘మాస్టర్’ ఆడియో రిలీజ్ వేడుకలో అజిత్ గురించి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
- sekhar
- Published On : March 16, 2020 / 02:28 PM IST
దళపతి విజయ్ ‘మాస్టర్’ ఆడియో రిలీజ్ వేడుకలో అజిత్ గురించి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..
‘దళపతి’ విజయ్, మాళవిక మోహనన్ జంటగా.. ‘మా నగరం’, ‘ఖైదీ’ సినిమాలతో ఆకట్టుకున్న లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో, ఎక్స్‌బి ఫిల్మ్ క్రియేటర్స్ సంస్థ నిర్మిస్తున్న అవుటండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్.. ‘మాస్టర్’.. ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తుండగా, ఆండ్రియా, శాంతను కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ చెన్నైలో ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ : ‘‘నా మనసులో ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్న నా ఫ్యాన్స్ అందరికీ వందనం.. ‘మాస్టర్’ ఆడియో విడుదల కార్యక్రమం నా అభిమానుల మధ్య జరగకపోవడం బాధగా ఉంది. కరోనా వైరస్ కారణంగా ఓ ప్రైవేట్ ఈవెంట్‌లా చేయాల్సి వచ్చింది. ఈ విషయంలో నన్ను క్షమించండి.. ఈరోజు నేను నా ఫ్రెండ్ అజిత్‌లా బ్లేజర్ వేసుకుని ఈ ఫంక్షన్‌కి వచ్చాను.. విజయ్ సేతుపతి ‘మాస్టర్’ లో బ్రహ్మాండమైన విలన్ పాత్ర చేశారు..
ఎందుకు ప్రతినాయకుడిగా ఈ సినిమా ఒప్పుకున్నారు అని నేను అడిగితే.. ‘ఐ రియల్లీ లైక్ యూ’ అనే నాలుగు మాటలతో నా నోరు మూయించారు’’ అంటూ విజయ్ అన్నారు. తమిళనాట విజయ్, అజిత్ అభిమానుల మధ్య ఏ స్థాయిలో వాదోపవాదాలు, వాగ్వాదాలు జరుగుతాయో తెలిసిందే. అలాంటిది విజయ్ వేదికపై అజిత్ పేరు ప్రస్తావించడంతో కేకలు, ఈలలు, అరుపులతో ప్రాంగణమంతా కాసేపు హోరెత్తిపోయింది. మన తెలుగు హీరోలు ఎందుకిలా ఉండరబ్బా.. అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్..
‘మాస్టర్’ సినిమాపై కోలీవుడ్‌లో భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రానికి మ్యూజిక్ : అనిరుధ్, సినిమాటోగ్రఫీ : సత్యన్ సూర్యన్.
The most waited video ?#Vijay about #Thala Ajith ???#Valimai #ValimaiDiwali #Ajith #AjithKumar #ThalaAjith #ValimaiLook #Master #MasterAudioLaunchDay pic.twitter.com/pNZTVvmg72
— Dheena Selvam (@DheenaSelvam57) March 15, 2020
