Jagamae Sangeetham : మరో కొత్త సిరీస్ నిర్మించిన చిరంజీవి కూతురు.. ఓటీటీ స్ట్రీమింగ్ ఎందులో? ఎప్పుడు?
పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో సుష్మిత కొణిదెల నిర్మాణంలో మ్యూజికల్ డ్రామాగా ఈ సిరీస్ తెరకెక్కింది. (Jagamae Sangeetham)
Jagamae Sangeetham
Jagamae Sangeetham : చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల నిర్మాతగా వరుసగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తా గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సిరీస్ లు, సినిమాలు నిర్మిస్తుంది. ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లు తీయగా తాజాగా మరో కొత్త సిరీస్ ని ప్రకటించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ హిందీ సిరీస్ ‘బందిష్ బాండిట్స్’ స్ఫూర్తితో ‘జగమే సంగీతం’ అనే వెబ్ సిరీస్ ని తెరకెక్కించారు.
పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో సుష్మిత కొణిదెల నిర్మాణంలో మ్యూజికల్ డ్రామాగా ఈ సిరీస్ తెరకెక్కింది. కర్ణాటక సంగీత సంప్రదాయాలను సమకాలీన శబ్దంతో అందంగా మేళవించిన హృద్యమైన స్వరకల్పనల ద్వారా విశాల్ చంద్రశేఖర్ ఈ సిరీస్‌కి ప్రాణం పోశారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, మధుబాల, అక్షయ్ లగుసాని, సుస్మితా శెట్టి.. కీలక పాత్రల్ని పోషించారు. సుమన్, సిజ్జు మీనన్, షఫీ, ఝాన్సీ, రఘు బాబు యెర్రా, రాకెట్ రాఘవ, నాగి జబర్దస్త్, మిర్చి నాకిరణ్, ప్రకావ్ కిరణ్, ప్రకావ్ కిరణ్, ప్రకావ్ కిరణ్, కేస్కావ్ రెడ్డి, రూప లక్ష్మి.. పలువురు ఈ సిరీస్ లో నటించారు.
Also See : Supritha : పెంపుడు కుక్క పుట్టిన రోజు సెలబ్రేట్ చేసిన సుప్రీత.. ఫొటోలు…
‘జగమే సంగీతం’ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ్ భాషల్లో సెప్టెంబర్ 4 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్టు నేడు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా 240 దేశాల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. కర్ణాటక సంగీతం చుట్టూ తాత, మనవడి కథాంశంతో ఈ సిరీస్ తెరకెక్కింది. రిలీజ్ డేట్ అనౌన్స్ సందర్భంగా ప్రైమ్ వీడియో ఇండియా, SVOD ఒరిజినల్స్ డైరెక్టర్, హెడ్ మాట్లాడుతూ.. కుటుంబం, వారసత్వం, ఆత్మశోధన వంటి ఇతివృత్తాలను అన్వేషిస్తూనే, సంగీతంలోని భావోద్వేగ శక్తిని ఈ జగమే సంగీతం కథ చెప్తుంది. హత్తుకునే సంగీతం ఈ సిరీస్ లో ఉంది అని అన్నారు.
నిర్మాత సుష్మిత కొణిదెల మాట్లాడుతూ.. సంగీతం కేవలం వారి ప్రపంచంలో ఒక భాగం మాత్రమే కాకుండా ఆ కుటుంబం మాటల్లో చెప్పలేని ప్రేమ, సంఘర్షణ, ఆరాటం, గర్వం, ఆశ, చివరికి స్వస్థత వంటి భావాలను వ్యక్తపరిచే భావోద్వేగ భాషగా మారే కథను చెప్పడం మా ఉద్దేశం. భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులు ఈ సిరీస్ ని చూడాలి అని అన్నారు.

