వరుణ్ తేజ్‌కు ‘జై బాలయ్య’ సెగ
- sekhar
- Published On : September 26, 2019 / 07:03 AM IST
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, హరీష్ శంకర్ కాంబోలో, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ‘గద్దలకొండ గణేష్’.. ఇటీవల విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో, మంచి కలెక్షన్లతో రన్ అవుతుంది. కేవలం 5 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.30 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గద్దలకొండ గణేష్’ సినిమా చూసి, మూవీ టీమ్‌ను అభినందించారు.
రీసెంట్‌గా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులను థ్యాంక్స్ తెలియచేయడానికి ‘జైత్రయాత్ర’ చేపట్టింది మూవీ యూనిట్. గుంటూరు జిల్లా నంబూరులోని VVIT క్యాంపస్‌లో వరుణ్ తేజ్ మాట్లాడుతుండగా.. స్టూడెంట్స్ అందరూ ఒక్కసారిగా ‘జై బాలయ్య.. జైజై బాలయ్య’ అంటూ స్లోగన్స్ స్టార్ట్ చేశారు. దీంతో వరుణ్ తేజ్ ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ అయిపోయాడు. మూవీ యూనిట్‌కి కూడా ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియలేదు. కొద్దిసేపు ‘జై బాలయ్య’ నినాదాలతో క్యాంపస్ హోరెత్తిపోయింది.
Read Also : చంపడం కాదు – గెలవడం ముఖ్యం : సైరా ట్రైలర్ 2..
గతంలో నాగబాబు, బాలకృష్ణపై చేసిన వ్యాఖ్యాలను దృష్టిలో పెట్టుకుని ఆ మధ్య చెన్నైలో నాగబాబు పాల్గొన్న ఓ కాలేజ్ ఫంక్షన్‌లో ఆయన మాట్లాడుతుండగా.. ‘జై బాలయ్య’ స్లోగన్స్‌తో దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు బాలయ్య ఫ్యాన్స్.. ఇప్పుడు వరుణ్ తేజ్ వంతు వచ్చింది. వరుణ్ మాట్లాడుతుండగా.. స్టూడెంట్స్ ‘జై బాలయ్య’ స్లోగన్స్‌తో రచ్చ రచ్చ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Jai balayya slogans…. #GaddalakondaGanesh at VVIT, Guntur @harish2you @IAmVarunTej @14reelsofficial pic.twitter.com/XgZWezY1L2
— Balayya Yuvasena (@BalayyaUvasena) September 25, 2019
