Jai Balayya Song : ఫ్యాన్స్ కోసం రిస్క్ చేసిన బాలయ్య
అభిమానులను అలరించడం కోసం ఎంతటి రిస్క్ చెయ్యడానికైనా రెడీగా ఉంటారు బాలయ్య..
- sekhar
- Updated on- November 28, 2021 / 07:45 PM IST
Jai Balayya Song
Jai Balayya Song: పాత్ర కోసం ఎంత రిస్క్ చెయ్యడానికైనా, తన అభిమానులను అలరించడానికి ఎంత సాహసానికి ఒడిగట్టడానికైనా ఎప్పుడూ ముందుంటారు నటసింహా నందమూరి బాలకృష్ణ. బాలయ్య – బోయపాటి కలయికలో వస్తున్న హ్యాట్రిక్ ఫిలిం ‘అఖండ’. తమన్ సంగీత దర్శకుడు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోలు.. ‘అడిగా అడిగా’, ‘భం అఖండ’ పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
Akhanda Mass Jathara : దేవుణ్ణి కరుణించమని అడుగు.. కనిపించమని కాదు.. బాలయ్య ‘మాస్ జాతర’
శనివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ‘జై బాలయ్య’ వీడియో సాంగ్ వదిలారు. ‘జై బాలయ్య’.. ఈ స్లోగన్‌తో నటసింహా నందమూరి బాలకృష్ణ అభిమానులకు ఎక్కడలేని ఎనర్జీ, ఊపు, ఉత్సాహం వస్తాయి. అలాంటిది ‘జై బాలయ్య’ పేరుతో ఓ సాంగ్ ఉంటే ఫ్యాన్స్‌కి ఏ రేంజ్ కిక్ వస్తుందనేది కొత్తగా చెప్పక్కర్లేదు కదా..
Akhanda Pre Release Event : ‘అఖండ’ సాక్షిగా బన్నీ – బాలయ్య బాండింగ్ అదిరింది..
ఈ పాటలో బాలయ్య ఎప్పటిలానే తన స్టైల్ ఎనర్జీతో అదిరిపోయే స్టెప్పులు వేసి అభిమానుల్లో ఫుల్ జోష్ నింపారు. ముఖ్యంగా బాల్ విసురుతూ వేసే స్టెప్ కానీ, కర్ర పట్టుకుని అలాగే షర్టులు మారేటప్పుడు వేసిన స్టెప్స్ అయితే అదిరిపోయాయి. ఈ పాట కేవలం బాలయ్య అభిమానులను మాత్రమే కాదు.. తెలుగు ప్రేక్షకులందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది.
Jai Balayya : బాలయ్య క్లాస్‌లో మాస్.. ఆ స్టెప్పులేంటి స్వామీ!
అయితే ఈ పాట వెనక బాలయ్య చాలా కష్టపడ్డారు. ఆరు పదుల వయసు దాటినా అభిమానుల కోసం అది కూడా చేయి ఫ్రాక్చర్ అయినా నొప్పిని సైతం లెక్కచెయ్యకుండా నా అభిమానుల కోసం చెయ్యాలి అంటూ బాలయ్య ‘జై బాలయ్య’ సాంగ్‌కి ఎంత కష్టపడ్డారనే విషయాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు దర్శకుడు బోయపాటి.
