జనతా కర్ఫ్యూ : సెలబ్రిటీల చప్పట్లతో షేక్ అయిన సోషల్ మీడియా
ప్రధాని మోడీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు సెలబ్రిటీల నుంచి అనూహ్య స్పందన లభించింది..
- sekhar
- Published on- March 23, 2020 / 07:10 AM IST
ప్రధాని మోడీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూకు సెలబ్రిటీల నుంచి అనూహ్య స్పందన లభించింది..
మార్చి 22 (ఆదివారం) కరోనా వైరస్ కట్టడిలో భాగంగా భారత ప్రధాని మోడీ పిలుపునిచ్చిన ‘జనతా కర్ఫ్యూ’ తో యావత్ భారతావనిని ఏకతాటిపైకి వచ్చింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు మోడీ పిలుపు మద్దతుగా నిలిచి.. ఇళ్లకే పరిమితమయ్యారు. జనతా కర్ఫ్యూలో భాగంగా సాయంత్రం 5 గంటలకు అత్యవసర సేవలు అందిస్తున్న పలు విభాగాల సిబ్బందికి ప్రజలంతా చప్పట్లు కొట్టి అభినందనలు తెలిపారు.
వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులకు చప్పట్లతో అభినందనలు తెలిపిన వీడియోను కొందరు తెలుగు సినీ ప్రముఖులు తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మనందరి కోసం పనిచేస్తున్నవారికి ప్రజలు బాల్కనీలో నిలుచుని చప్పట్లతో అభినందనలు తెలుపడం గౌరవంగా ఉందని మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ అన్నారు. జానియర్ ఎన్టీఆర్ వైద్య, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నవారికి తన కుమారుడితో కలిసి చప్పట్లు, గంట కొట్టి అభినందనలు తెలిపారు. తారక్ పెద్ద కొడుకు అభయ్‌ను ఎత్తుకోగా గంట కొట్టాడు.
చప్పట్లతో వైద్య, పారిశుద్ధ్య కార్మికులకు అభినందనలు తెలిపిన మంచు మనోజ్.. వందేమాతరం అంటూ నినదించారు. మెగా ఫ్యామిలీ, కృష్ణంరాజు కుటుంబం, మోహన్‌బాబు కుటుంబం, అల్లు ఫ్యామిలీ, రాజశేఖర్ ఫ్యామిలీ, శ్రీకాంత్ ఫ్యామిలీ, నాగబాబు కుటుంబం, సుకుమార్, బోయపాటి శ్రీను, యాక్షన్ కింగ్ అర్జున్ ఫ్యామిలీలు, వెంకటేష్, చార్మి, శ్రీకాంత్, గుణశేఖర్, పూజా హెగ్డే, గోపిచంద్, పూరి జగన్నాథ్, అనిల్ రావిపూడి, పవన్ కల్యాణ్, రమ్యకృష్ణ, కృష్ణవంశీ, నిఖిల్, విశ్వక్‌సేన్‌లు కూడా చప్పట్లతో తమ అభినందనలు తెలిపారు.
