Sigma Release Date: దళపతి విజయ్ కొడుకు ‘సిగ్మా’ రిలీజ్ డేట్ ఫిక్స్.. సందీప్ కిషన్ మూవీ వచ్చేది అప్పుడే
జాసన్ సంజయ్, సందీప్ కిషన్ కాంబినేషన్ లో వస్తున్న సిగ్మా(Sigma Release Date) సినిమా విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్.
Jason sanjay and sundeep kishan sigma movie release date fix
- విజయ్ కొడుకు దర్శకత్వంలో ‘సిగ్మా’
- సందీప్ కిషన్ హీరోగా ఎంట్రీ
- జూలై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల
Sigma Release Date: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘సిగ్మా(Sigma Release Date)’. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. జాసన్ సంజయ్ మెగాఫోన్ పట్టిన మొదటి సినిమా కావడంతో కోలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీ మొత్తం ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు పెట్టుకుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు సోషల్ మీడియాలో నెటిజన్లు, ముఖ్యంగా విజయ్ అభిమానుల నుండి అత్యంత అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.
ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాన్ని జూలై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దాంతో దళపతి ఫ్యాన్స్ థియేటర్లలో తమ వారసుడి సినిమాను చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన జాసన్ సంజయ్‌కు, అలాగే వైవిధ్యమైన కథలతో మెప్పిస్తున్న సందీప్ కిషన్‌కు ఈ ‘సిగ్మా’ చిత్రం ఎలాంటి విజయాన్ని అందిస్తుంది, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది అనేది తెలియాలంటే జూలై ఆఖరి వరకు వేచి చూడాల్సిందే.
A high-stakes heist begins. 💵 #SIGMA storms into theatres on July 31st. 🗓️ Gear up for the ultimate quest. 🔥@official_jsj @LycaProductions #Subaskaran @gkmtamilkumaran @jsjmedia01 @sundeepkishan @MusicThaman @fariaabdullah2 #RajuSundaram #SampathRaj @shivpanditt @follow_anbu… pic.twitter.com/Sd87kylWZN
— Lyca Productions (@LycaProductions) May 29, 2026
