NTR : హమ్మయ్య.. ఎట్టకేలకు ఏపీ ఎన్నికల్లో కూటమి గెలుపు పై స్పందించిన ఎన్టీఆర్.. ఏమన్నాడంటే..

తాజాగా నేడు జూనియర్ ఎన్టీఆర్ ఏపీ ఫలితాలపై స్పందించాడు.

NTR : హమ్మయ్య.. ఎట్టకేలకు ఏపీ ఎన్నికల్లో కూటమి గెలుపు పై స్పందించిన ఎన్టీఆర్.. ఏమన్నాడంటే..

Junior NTR Reacts on Chandrababu Pawan Kalyan Alliance Victory in AP Elections

NTR : ఏపీలో కూటమి భారీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఏపీలో గెలిచిన అభ్యర్థులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సినీ పరిశ్రమ నుంచి హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు, అనేకమంది సినీ ప్రముఖులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కి అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. నిన్నే చాలా మంది అభినందిస్తూ ట్వీట్స్ చేశారు.

Also Read : Renu Desai : కంగ్రాట్స్ అన్నయ్య.. అంటూ ఆ ఎమ్మెల్యేపై రేణుదేశాయ్ పోస్ట్..

తాజాగా నేడు జూనియర్ ఎన్టీఆర్ ఏపీ ఫలితాలపై స్పందించాడు. ఎన్టీఆర్ తన ట్విట్టర్లో.. ప్రియమైన చంద్రబాబు మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన లోకేష్ కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, MPలుగా గెలిచిన భరత్, పురంధేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు. అలాగే ఇంతటి ఘనవిజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని పోస్ట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

అయితే ఎన్టీఆర్ టీడీపీకి మద్దతుగా ప్రచారం చేయలేదని, కనీసం మాట్లాడలేదని, సోషల్ మీడియాలో కూడా గెలవాలని పోస్టులు కూడా చేయలేదని కొంతమంది ఎన్టీఆర్ ని విమర్శించారు. ఏపీ ఎన్నికల్లో ఈసారి పవన్ కళ్యాణ్ కూడా భారీ మెజార్టీతో గెలవడంతో నిన్నే సినీ పరిశ్రమ నుంచి చాలా మంది కంగ్రాట్స్ చెప్తూ ట్వీట్స్ చేశారు. ఎన్టీఆర్ ఇవాళ మధ్యాహ్నం ట్వీట్ చేయడంతో హమ్మయ్య ఇప్పటికైనా చేసావు అని కొంతమంది కామెంట్స్ చేస్తుంటే, ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ మరోసారి వైరల్ అవుతున్నారు.