Kacha Badam : దుమ్ములేపుతున్న ‘కచ్చా బాదమ్’.. సెలబ్రిటీలు, యూత్ డ్యాన్స్ మూమెంట్స్ కేక

మూమెంట్స్ మాత్రం మామూలుగా లేవు. బాయ్స్ ఎనర్జీతో స్టెప్పులేస్తుంటే.. గాళ్స్, ఉమన్ సెలబ్రిటీలు, నాజూకు బ్యాచిలర్, సింగిల్ ముద్దుగుమ్మలు ఈ స్టెప్పులకు తమ సోయగాలను జతచేసి.. సోషల్ మీడియ

Kacha Badam Song Goes Viral

Kacha Badam : సోషల్ మీడియాలో ట్రెండింగ్ కూడా కరోనా వైరస్ లాంటిదే. పూటకో వేరియంట్.. సీజన్ సీజన్ కూ ఓ వైరల్ సాంగ్. ఈ వైరల్ పాటలు, కంటెంట్ కు ప్రాంతీయ భేదం ఉండదు. ఖండాలు.. సముద్రాలు.. పీఠభూములు.. కొండలు.. గుట్టలు.. నదులు.. అడవులు.. ఆదివాసీ గూడేలు దాటి.. అందిరినీ చుట్టేస్తుంటాయి. వారిలో పూనకం తెప్పించి స్టెప్పులేయిస్తుంటాయి.

Read This : Mouni Roy : మ‌ల‌యాళీ, బెంగాలీ.. రెండు పద్ధతుల్లో మౌనిరాయ్ వివాహం.. వీడియో రిలీజ్

సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ లో లేటెస్ట్ ట్రెండింగ్ సాంగ్ కచ్చా బాదమ్(Kacha Badam- BADAM BADAM KACHA BADAM). కొన్ని వారాలుగా ఈ పాట ఊపే ఊపుడుకు ఒక్క ఇన్ స్టా రీల్సే కాదు.. షార్ట్స్, జోష్, మాజ్.. అన్ని షార్ట్ వీడియో ప్లాట్ ఫామ్ లు షేకవుతున్నాయి.

ఓ పల్లెటూరి పాటగాడు.. బాదామ్.. బాదామ్.. కచ్చా బాదామ్ అంటూ పాడే ఈ పాట గమ్మత్తుగా ఉంటుంది. మంచి మ్యూజిక్ బీట్ ఉండటంతో.. స్టెప్ కూడా వైరల్ అయింది. అదే స్టెప్పుకు ఎక్స్ ప్రెషన్స్ మిక్స్ చేసి.. రిపీట్ చేసి లైక్‌లు, కామెంట్లు కొట్టేస్తున్నారు సెలబ్రిటీలు, టాలెంటెడ్ యూజర్స్.

Read This : Raviteja : తమిళ్ హీరో సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్న మాస్ మహారాజ్

మూమెంట్స్ మాత్రం మామూలుగా లేవు. బాయ్స్ ఎనర్జీతో స్టెప్పులేస్తుంటే.. గాళ్స్, ఉమన్ సెలబ్రిటీలు, నాజూకు బ్యాచిలర్, సింగిల్ ముద్దుగుమ్మలు ఈ స్టెప్పులకు తమ సోయగాలను జతచేసి.. సోషల్ మీడియాలో ఆరబోసేస్తున్నారు.

గల్లీ గల్లీ తిరిగి పల్లీలు, బాదామ్ లు, డ్రై ఫ్రూట్స్ అమ్ముకునే సైకిల్ వ్యాపారి నుంచి ఈ పాట పుట్టింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పాటకు సంబంధించిన కొన్ని వీడియోలను కింద లింక్ లలో చూసేయండి.