Bharateeyudu 3 : భారతీయుడు 3 స్టోరీ అదేనా? ఫ్లాష్‌బాక్‌లో.. కాజల్, కమల్ హాసన్ యుద్ధ వీరులుగా..

భారతీయుడు 3 ట్రైలర్ భారతీయుడు 2 సినిమా చివర్లో ప్లే చేసారు.

Bharateeyudu 3 : భారతీయుడు 3 స్టోరీ అదేనా? ఫ్లాష్‌బాక్‌లో.. కాజల్, కమల్ హాసన్ యుద్ధ వీరులుగా..

Kamal Haasan Bharateeyudu 3 Movie Trailer Played after Bharateeyudu 2 Movie Story rumours goes Viral

Bharateeyudu 3 : కమల్ హాసన్, శంకర్ కాంబోలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా భారతీయుడు 2 సినిమా నేడు థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజయింది. ఈ సినిమాపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. సినిమా ఎలా ఉన్నా కమల్ హాసన్ మాత్రం తన నటనతో అదరగొట్టేసాడు అని అంటున్నారు. ముందుగానే భారతీయుడు పార్ట్ 3 కూడా ఉందని ప్రమోషన్స్ లో తెలిపారు. అలాగే భారతీయుడు 3 ట్రైలర్ ని ఈ సినిమా చివర్లో ప్లే చేస్తామని తెలిపారు.

చెప్పినట్టే భారతీయుడు 3 ట్రైలర్ భారతీయుడు 2 సినిమా చివర్లో ప్లే చేసారు. ఈ ట్రైలర్ అయితే బాగుందని అంటున్నారు. భారతీయుడు 2 సినిమాలో కమల్ హాసన్ తిరిగొచ్చి దేశాన్ని మారుద్దామనుకుంటే అతనికే వ్యతిరేకత ఎదురవుతుంది. భారతీయుడు 3 ట్రైలర్ లో చూపించిన దాని ప్రకారం ఫ్లాష్ బ్యాక్ లో వీరశేఖరన్ సేనాపతిగా కమల్ హాసన్ బ్రిటిష్ వాళ్ళతో యుద్దాలు చేస్తాడని, కాజల్ కూడా కమల్ తో కలిసి బ్రిటిష్ వాళ్లపై యుద్దాలు చేస్తుందని, యుద్ధ వీరులుగా ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూపించబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే ప్రస్తుతం సేనాపతిని పోలీసులు పట్టుకోవడంతో అతనికి ఉరిశిక్ష విధిస్తారని తెలుస్తుంది.

Also Read : Game Changer : సినిమా రిలీజ్ అవ్వకుండానే భారతీయుడు 2లో.. రామ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సాంగ్..

పార్ట్ 3లో అదిరిపోయే ఫ్లాష్ బ్యాక్ యాక్షన్ సీక్వెన్స్ లతో పాటు, ప్రస్తుతం భారతీయుడు ఏం చేసాడు అని కూడా చూపించబోతున్నారని భారతీయుడు 3 ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. దీంతో భారతీయుడు 2 ఎలా ఉన్న పార్ట్ 3పై మాత్రం అంచనాలు నెలకొన్నాయి. ఇక కాజల్ కూడా యాక్షన్ సీన్స్ చేయబోతోందని చూపించడంతో కాజల్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

Also Read : భారతీయుడు 2 రివ్యూ.. సేనాపతి తిరిగొచ్చి ఏం చేశాడు?