Attack On Darshan : షాకింగ్.. స్టార్ హీరోపై షూతో దాడి, బెడ్ రూమ్‌లోకి లాక్కెళ్లి దుస్తులు విప్పేయాలన్న కామెంట్స్ ఎఫెక్ట్?

కన్నడ హీరో దర్శన్ కు చేదు అనుభవం ఎదురైంది. అతడిపై షూతో దాడి జరిగింది. హోస్పేటలో ఈ ఘటన జరిగింది. హోస్పేటలతో 'క్రాంతి' సినిమా పాటల ఆవిష్కరణ కార్యక్రమంలో దర్శన్ పాల్గొన్నాడు.

Attack On Darshan : కన్నడ హీరో దర్శన్ కు చేదు అనుభవం ఎదురైంది. అతడిపై షూతో దాడి జరిగింది. హోస్పేటలో ఈ ఘటన జరిగింది. హోస్పేటలతో ‘క్రాంతి’ సినిమా పాటల ఆవిష్కరణ కార్యక్రమంలో దర్శన్ పాల్గొన్నాడు. నటి రచితారాయ్ మాట్లాడుతోంది. ఆమె పక్కనే నిలబడి ఉన్న దర్శన్ పై ఓ వ్యక్తి షూ విసిరాడు. ఆ షూ నేరుగా అతడి ముఖానికి తాకింది. ఈ అనూహ్య పరిణామంతో స్టేజి మీదున్న దర్శన్ తో పాటు అంతా షాక్ తిన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

‘క్రాంతి’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కర్నాటకలోని హోస్పేట్‌లో సాంగ్‌ లాంఛ్‌ కార్యక్రమానికి దర్శన్ హాజరయ్యాడు‌. స్టేజీపై నిల్చోని ఫ్యాన్స్ కు అభివాదం చేస్తున్న సమయంలో అతడిపై ఓ వ్యక్తి బూటు విసిరాడు. అది నేరుగా దర్శన్ ముఖాన్ని తాకింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read..Pawan Kalyan: టైటిల్‌తో పాటు పవన్ కటౌట్ కూడా మారుస్తానంటోన్న హరీష్ శంకర్..?

ఇటీవల అదృష్ట దేవతపై దర్శన్ చేసిన అనుచిత వ్యాఖ్యలే ఈ దాడికి కారణంగా తెలుస్తోంది. ‘అదృష్ట దేవత ప్రతిసారీ తలుపు తట్టదు. తలుపు తట్టినప్పుడే చేయి పట్టుకుని బెడ్‌రూమ్‌లోకి లాక్కెల్లి దుస్తులు విప్పేయాలి. దుస్తులు విప్పి బందీ చేస్తే ఆమె ఎక్కడికీ వెళ్లదు. లేదంటే మరో చోటుకి వెళ్లిపోతుంది’ అని దర్శన్‌ అన్నాడు. అంతే.. అతడు చేసిన కామెంట్లు వివాదానికి దారితీశాయి. దీనిపై రచ్చ జరుగుతోంది. కొందరు దర్శన్ పై ఫైర్ అయ్యారు. అదృష్ట దేవతను లక్ష్మీ దేవతగా భావిస్తారని, విష్ణుమూర్తి భార్య అయిన లక్ష్మీదేవి గురించి అంత నీచంగా ఎలా మాట్లాడతావంటూ దర్శన్ పై విరుచుకుపడ్డారు. అతడిపై దారుణమైన ట్రోల్స్‌ వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పుడీ షూ అటాక్ జరిగి ఉండొచ్చని అంతా భావిస్తున్నారు.

Also Read..Dhamaka: ధమాకాలో ముద్దులు అందుకే లేవంటోన్న రవితేజ..?

కాగా, ఈ ఘటనపై కన్నడ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ చర్య తన మనసును బాధించిందన్నాడు. మానవత్వాన్ని మరిచి ఇలాంటి అమానవీయ ఘటనలకు పాల్పడొద్దని కోరారు. అభిమానంతో ప్రేమను చూపించండి. ద్వేషం, అగౌరవం కాదు అంటూ ఓ వీడియోని షేర్‌ చేశాడు శివరాజ్ కుమార్.