Premi Vishwanath Son : కార్తీక దీపం వంటలక్కకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా? బాడీ బిల్డర్‌లా ఎలా ఉన్నాడో చూడండి..

కార్తీక దీపం వంటలక్క ప్రేమి విశ్వనాధ్ కి కండల వీరుడు లాంటి కొడుకు ఉన్నాడని చాలా తక్కువమందికి తెలుసు.

Premi Vishwanath Son : కార్తీక దీపం వంటలక్కకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా? బాడీ బిల్డర్‌లా ఎలా ఉన్నాడో చూడండి..

Karthika Deepam Serial Vantalakka Fame Premi Vishwanath Son Photos goes Viral

Updated On : July 10, 2024 / 9:31 AM IST

Karthika Deepam Fame Premi Vishwanath Son : తెలుగులో కార్తీకదీపం సీరియల్ లో వంటలక్క పాత్రతో బాగా ఫేమస్ అయింది ప్రేమి విశ్వనాధ్. తెలుగు ఆడియన్స్ వంటలక్క పాత్రని బాగా దగ్గర చేసుకున్నారు. ఆ సీరియల్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. దానికి సీక్వెల్ కూడా ఇప్పుడు నడుస్తుంది. అయితే ప్రేమి విశ్వనాధ్ మలయాళం నటి అని, ఆమెకి పెళ్లయిందని అందరికి తెలుసు.

Also Read : Devara Update : ‘దేవర’లో రెండు పాటలేనా..? దేవర షూటింగ్ అప్డేట్.. ఇంకెంత బ్యాలెన్స్ ఉందంటే..?

కానీ ప్రేమి విశ్వనాధ్ కి కండల వీరుడు లాంటి కొడుకు ఉన్నాడని చాలా తక్కువమందికి తెలుసు. ప్రేమి విశ్వనాధ్ గతంలో తన కొడుకుతో ఫొటోలు పోస్ట్ చేసింది. ఇటీవల మరోసారి తన కొడుకుతో రీల్ చేసి పోస్ట్ చేయగా అది వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసి వంటలక్కకు ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా అని ఆశ్చర్యపోతున్నారు. ఇక ఈ రీల్ లో తన కొడుకు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ కూడా యాడ్ చేయడంతో అతని అకౌంట్ ని కూడా చూస్తున్నారు నెటిజన్లు.

View this post on Instagram

A post shared by Manujith (@_.maaaaaaaanu)

అతని పేరు మనుజిత్ అని తెలుస్తుంది. అతను ఏం చదువుతున్నాడో, ఏం చేస్తున్నాడో తెలియకపోయినా కండల వీరుడు అని మాత్రం అర్ధమవుతుంది. అతని సోషల్ మీడియా అకౌంట్ అంతా జిమ్ కి సంబంధించిన ఫొటోలు, కండలతో అతని బాడీ చూపించే ఫొటోలే ఉన్నాయి. దీంతో ఇతను మంచి ఫిట్నెస్ ఫ్రీక్ అని తెలుస్తుంది. మరి ఇతను కూడా నటుడిగా ఎంట్రీ ఇస్తాడేమో చూడాలి. మొత్తానికి ఇంత పెద్ద కండల వీరుడు వంటలక్క కొడుకు అంటే నమ్మలేకపొతున్నారు. వంటలక్క సంతూర్ మమ్మీ అని కామెంట్స్ చేస్తున్నారు.