Dilruba : కిర‌ణ్ అబ్బ‌వ‌రం ‘దిల్ రూబా’ నుంచి కేసీపీడీ వ‌చ్చేసింది..

కిర‌ణ్ అబ్బ‌వ‌రం 'దిల్ రూబా' నుంచి కేసీపీడీ వ‌చ్చేసింది.

Dilruba : కిర‌ణ్ అబ్బ‌వ‌రం ‘దిల్ రూబా’ నుంచి కేసీపీడీ వ‌చ్చేసింది..

KCPD Lyrical Video out now from Dilruba

Updated On : March 11, 2025 / 9:14 AM IST

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న చిత్రం ‘దిల్ రూబా’. విశ్వ క‌రుణ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. అందాల భామ రుక్సర్ ధిల్లాన్ న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్ ప్రొడక్షన్, ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తన నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

రొమాంటిక్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. సామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రం ఈ నెల 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది. ఇప్ప‌టికే మూడు పాట‌ల‌ను విడుద‌ల తాజాగా నాలుగో పాట కేసీపీడీని విడుద‌ల చేసింది.

Prabhas – Prasanth Varma : ప్రభాస్ – ప్రశాంత్ వర్మ సినిమా టైటిల్ అదేనా? పురాణాల్లోని ఆ పాత్రతో..?
ఇదిలా ఉంటే.. ఈ చిత్ర‌ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్ గా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 11న హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో సాయంత్రం 6 గంటల నుంచి ఈవెంట్ ప్రారంభం కానున్న‌ట్లు చిత్ర బృందం తెలిపింది.