Prabhas : ‘స్పిరిట్’ సినిమాలో ప్రభాస్‌కి జోడిగా కీర్తి సురేష్.. నిజమేనా..!

'స్పిరిట్' సినిమాలో ప్రభాస్‌కి జోడిగా కీర్తి సురేష్ నటించబోతున్నారా..? ఆల్రెడీ మూవీ టీం..

Prabhas : ‘స్పిరిట్’ సినిమాలో ప్రభాస్‌కి జోడిగా కీర్తి సురేష్.. నిజమేనా..!

Keerthy Suresh is in talks for Prabhas Sandeep Vanga Spirit movie

Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘కల్కి’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తరువాత రాజాసాబ్, సలార్ 2, స్పిరిట్, హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. వీటిలో ప్రభాస్ అభిమానులంతా.. స్పిరిట్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆ సినిమాని సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్నారు. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో సందీప్ వంగ యూత్ లో మంచి ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు.

దీంతో ప్రభాస్ తో తెరకెక్కించబోయే స్పిరిట్ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాలో ప్రభాస్ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. సందీప్ వంగ గత రెండు సినిమాలు మాదిరి గానే.. స్పిరిట్ లో కూడా ప్రభాస్ క్యారెక్టర్ అగ్రెసివ్ గా ఉండబోతుందట. ఇది ఇలా ఉంటే, ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది.

Also read : Family Star : ఆ దేశంలో రిలీజయ్యే మొట్టమొదటి తెలుగు సినిమా.. ఫ్యామిలీ స్టార్..

మొన్నటివరకు యానిమల్ భామల పేర్లు వినిపించాయి. రష్మిక మందన్న, తృప్తి దిమ్రీ ప్రభాస్ కి జోడిగా నటించబోతున్నారని టాక్ వినిపించింది. ఇక తాజాగా మరో కొత్త పేరు వినిపిస్తుంది. మహానటి కీర్తి సురేష్ ని స్పిరిట్ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని మూవీ టీం ఆలోచింస్తుందట. ఇందుకోసం చర్చలు కూడా జరుపుతున్నట్లు సమాచారం. మరి ఫైనల్ గా ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా ఎవరు కనిపిస్తారో చూడాలి.

కాగా ఈ మూవీని ఈ ఏడాది చివరిలో షూటింగ్ కి తీసుకు వెళ్లనున్నారు. ప్రభాస్ కల్కి పనులు పూర్తి చేసిన తరువాత రాజాసాబ్ ని కంప్లీట్ చేసే పని తీసుకోనున్నారు. ఆ తరువాతే స్పిరిట్ ని పట్టాలు ఎక్కించనున్నారు. స్పిరిట్ తో పాటే సలార్ 2 షూటింగ్ ని కూడా ఒకసారి నడిపించనున్నారని సమాచారం.