Keerthy Suresh బర్త్‌డే ట్రీట్!
- sekhar
- Updated on- October 17, 2020 / 12:54 PM IST
Keerthy Suresh: ‘మహానటి’ చిత్రంతో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్ అందుకున్న నేచురల్ యాక్ట్రెస్ కీర్తి సురేష్ పుట్టిన రోజు నేడు (అక్టోబర్ 17).. ఈ సందర్భంగా పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇది కీర్తి 29వ బర్త్‌డే. ఈ స్పెషల్ డే నాడు కీర్తికి శుభాకాంక్షలు చెబుతూ కొత్త సినిమా అప్‌డేట్స్ అనౌన్స్ చేశారు మేకర్స్.
సూపర్‌స్టార్ మహేష్ బాబు, పరశురామ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో కీర్తి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ విషయాన్ని కన్ఫామ్ చేస్తూ.. మహేష్ అలాగే మూవీ టీమ్ కీర్తికి విషెస్ తెలిపారు. ‘‘టాలెంటెడ్ కీర్తి సురేష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ‘సర్కార్ వారి పాట’ టీమ్ మీకు స్వాగతం పలుకుతోంది. ఈ సినిమా కచ్చితంగా మీ కెరీర్‌లో ఒక మంచి జ్ఞాపకంగా నిలుస్తుంది’’ అంటూ మహేష్ ట్వీట్ చేశాడు.
కాగా కీర్తి సురేష్ ‘మిస్ ఇండియా’ అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నరేంద్ర నాథ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కీర్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ న్యూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ రెండు చిత్రాలకూ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతమందిస్తుండడం విశేషం.
