హిమాలయాల్లో కింగ్ నాగ్.. వీడియో వైరల్..
- sekhar
- Published On : October 23, 2020 / 05:48 PM IST
Nagarjuna-Himayalas: ‘కింగ్’ నాగార్జున టైటిల్ రోల్ పోషిస్తోన్న చిత్రం ‘వైల్డ్ డాగ్’. అహిషోర్ సాల్మన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా తాజా షెడ్యూల్ హిమాలయాల్లో మొదలైంది. తాజాగా రోహ్‌తంగ్ పాస్‌లో తీసిన వీడియోను నాగార్జున ట్విట్టర్‌లో షేర్ చేశారు. సముద్ర మట్టానికి 3980 మీటర్ల ఎత్తులో తాము ఉన్నామని, ఇది చాలా డేంజరస్ ప్రాంతమని నాగార్జున పేర్కొన్నారు.
నవంబర్ నుంచి మే వరకు ఆ ప్రదేశాన్ని మూసేస్తారని, ‘వైల్డ్ డాగ్’ షూటింగ్ ఇక్కడ ప్రస్తుతం చాలా బాగా జరుగుతోందని తెలిపారు. ఏడు నెలల తర్వాత షూటింగుకు ఇలాంటి అద్భుతమైన ప్లేస్‌కు రావడం చాలా ఆనందంగా ఉందని, 21 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని తిరిగి వచ్చేస్తామని పేర్కొన్నారు నాగ్.
మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. దియా మిర్జా, సయామీ ఖేర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. యథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఏసీపీ విజయ్ వర్మగా నాగార్జున ఇప్పటివరకూ చేయని విభిన్న తరహా పాత్రను చేస్తున్నారు.
#WildDog in the Himalayas!! pic.twitter.com/k1gf1fNb7E
— Nagarjuna Akkineni (@iamnagarjuna) October 23, 2020
