Kiran Abbavaram : బ్యాక్ టు బ్యాక్ హిట్స్.. రేటు పెంచేసిన కిరణ్ అబ్బవరం..? లైనప్ చూస్తే దిమ్మ తిరగాల్సిందే..
తాజాగా కిరణ్ అబ్బవరం రెమ్యునరేషన్ పెంచేసాడని టాక్ నడుస్తుంది. (Kiran Abbavaram)
Kiran Abbavaram
Kiran Abbavaram : యంగ్ హీరోలలో ఇప్పుడు కిరణ్ అబ్బవరం మినిమమ్ గ్యారెంటీ హీరో. ఇటీవలే క, కె ర్యాంప్ సినిమాలతో పెద్ద హిట్స్ కొట్టాడు. దీంతో కిరణ్ మార్కెట్ పెరగడమే కాకుండా వరుస సినిమా ఆఫర్స్ వస్తున్నాయి. మరో పక్క నిర్మాతగా కూడా మారి కిరణ్ అబ్బవరం సినిమాలు చేస్తున్నాడు.(Kiran Abbavaram)
తాజాగా కిరణ్ అబ్బవరం రెమ్యునరేషన్ పెంచేసాడని టాక్ నడుస్తుంది. కిరణ్ అబ్బవరం ప్రస్తుతం సినిమాకు 5 కోట్లు అడుగుతున్నాడని టాలీవుడ్ టాక్. మొన్నటి వరకు మూడు కోట్లే తీసుకున్నాడని, ఇప్పుడు అయిదు కోట్లు అడుగుతున్నాడని పలువురు నిర్మాతలు అనుకుంటున్నారు. దీంతో కిరణ్ అబ్బవరం సినిమా బడ్జెట్ కూడా కాస్త పెరిగిపోతుంది.
Also Read : Anaswara Rajan : ‘విత్ లవ్’.. క్యూట్ వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన హీరోయిన్..
అయితే కిరణ్ నుంచి రాబోయే చెన్నై లవ్ స్టోరీ సినిమాకు మాత్రం రెమ్యునరేషన్ తీసుకోలేదని ఉన్నప్పుడే ఇమ్మన్నాడని, లేదా ప్రాఫిట్స్ వచ్చాక తీసుకుంటాడని నిర్మాత SKN స్వయంగా చెప్పాడు.
ఇక కిరణ్ అబ్బవరం లైనప్ లో చెన్నై లవ్ స్టోరీ సినిమా, సుకుమార్ నిర్మాణంలో ఒక సినిమా, అమెజాన్ కి ఒక వెబ్ సిరీస్, బాలీవుడ్ సినిమా ఒకటి, కిరణ్ అబ్బవరం సొంత డైరెక్షన్ లో ఒక సినిమా ఉంది. ఇలా ఆల్మోస్ట్ అరడజను సినిమాలు లైనప్ లో ఉన్నాయి కిరణ్ అబ్బవరంకి. అయినా వరుస ఫ్లాప్ లు ఇస్తున్న మీడియం రేంజ్ హీరోలే 7 నుంచి 10 కోట్లు తీసుకుంటున్నారు కిరణ్ 5 కోట్లు తీసుకుంటే తప్పు లేదు అని ఫ్యాన్స్, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Also Read : Allu Sirish : నయనిక కంటే ముందు అల్లు శిరీష్ కి లవ్ స్టోరీ ఉందని తెలుసా? ఎందుకు బ్రేకప్ అయిందంటే..?
