Latha Rajinikanth : రజినీకాంత్ భార్యకు రాజ్యసభ పదవి..? తమిళ రాజకీయాల్లో చర్చ..
రజినీకాంత్ గతంలో పార్టీ పెడతాను, రాజకీయాల్లోకి వస్తాను అని ఆయనే స్వయంగా ప్రకటించినా తర్వాత పలు కారణాలతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. (Latha Rajinikanth)
Latha Rajinikanth
Latha Rajinikanth : ఇటీవల తమిళ రాజకీయాలు చాలా ఆసక్తిగా ఉంటున్న సంగతి తెలిసిందే. రోజుకో సినీ సెలబ్రిటీ చుట్టూ తమిళ రాజకీయం తిరుగుతుంది. రోజుకొక సినిమా సెలబ్రిటీ రాజకీయాల్లోకి వస్తారని, పార్టీ పెడతారని వార్తలు వస్తున్నాయి. తాజాగా రజినీకాంత్ భార్య లతా రజినీకాంత్ కి రాజ్యసభ పదవి ఇస్తారని వార్తలు వస్తున్నాయి.
రజినీకాంత్ గతంలో పార్టీ పెడతాను, రాజకీయాల్లోకి వస్తాను అని ఆయనే స్వయంగా ప్రకటించినా తర్వాత పలు కారణాలతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ప్రస్తుతం బిజెపితో సాన్నిహిత్యంగానే ఉంటున్నారు రజినీకాంత్. ఈ క్రమంలో రాష్ట్రపతి కోటాలో లతా రజినీకాంత్ రాజ్యసభకు నామినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతుంది.
Also Read : Bigg Boss Today Promo : రోహిత్ మాట విని త్రిగున్ కి వెన్నుపోటు పొడిచిన అమన్.. ఝలక్ ఇచ్చిన ఝాన్సీ..
ఇప్పటికే రజినీకాంత్, లతా రజినీకాంత్ లతో ఢిల్లీ పెద్దలు చర్చలు జరిపారని సమాచారం. రాజ్యసభకు సంబంధించి రాజ్యాంగం ప్రకారం 12 మంది విశిష్ట వ్యక్తులను రాష్ట్రపతి నేరుగా నామినేట్ చేసే అధికారం ఉంది. కళలు, సాహిత్యం, విజ్ఞానశాస్త్రం, సమాజ సేవ.. వంటి రంగాల్లో కృషి చేసిన వ్యక్తులను కేంద్రం సిఫారసుతో రాష్ట్రపతి ఈ పదవికి ఎంపిక చేస్తారు. గతంలో సచిన్ టెండూల్కర్, ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్.. ఇలా అనేకమంది సెలబ్రిటీలు రాజ్యసభకు వెళ్లారు. ఆ కోవలోనే లతా రజనీకాంత్ కేవలం ఆయన భార్యగానే కాకుండా, గాయనిగా, విద్యావేత్తగా, సేవా కార్యక్రమాలతో సామాజిక కార్యకర్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. సామాజిక సేవ కోటాలో లతా రజినీకాంత్ పేరు పరిశిలనలో ఉన్నట్టు తెలుస్తుంది.
తమిళనాడులో బలపడాలని బిజెపి ఎప్పట్నుంచో ప్రయత్నాలు చేస్తుంది. లతా రజినీకాంత్ కి రాజ్యసభ పదవి ఇస్తే రజినీకాంత్ సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఎంతో కొంత బిజెపి పార్టీ తమిళనాట పుంజుకుంటుందని భావిస్తున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.
Also See : Vishnu Priya Bhimeneni : బాబోయ్.. నలుపు చీరలో అందాలు ఆరబోస్తూ.. విష్ణుప్రియ ఫొటోలు వైరల్..
