వెంకటలక్ష్మీ-చాలా హాట్ గురూ!

వేర్ ఈజ్ ది వెంటలక్ష్మీ ట్రైలర్ రిలీజ్..

  • Publish Date - February 20, 2019 / 04:57 AM IST

వేర్ ఈజ్ ది వెంటలక్ష్మీ ట్రైలర్ రిలీజ్..

హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మీ మెయిన్ లీడ్‌గా, ఎక్స్ ఎమ్మెల్యే గురునాథ రెడ్డి సమర్పణలో, ఏబీటీ క్రియేషన్స్ బ్యానర్‌పై, కిషోర్ కుమార్ డైరెక్షన్‌లో రూపొందుతున్న సినిమా.. వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ.. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన టీజర్, పాపా నీకేదంటే ఇష్టం పాటకి మంచి రెస్పాన్స్ వస్తుంది. రీసెంట్‌గా వేర్ ఈజ్ ది వెంటలక్ష్మీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. బెల్లంపల్లి విలేజ్‌లో జరిగే కథ ఇది.. లవ్‌లో పడ్డ ఒక టీనేజ్ కపుల్, జులాయిగా తిరిగే పండుగాడు, చంటిగాడు, ఏదో పనిమీద ఆ ఊరికొచ్చిన వెంకటలక్ష్మీకి వీళ్ళు లైన్ వెయ్యడం, ఆమె దెయ్యమని తెలిసాక భయపడడం, ఆమెకో భారీ ఫ్లాష్ బ్యాక్.. ఇలా, ఎప్పుడో, ఎక్కడో, ఎన్నో సినిమాల్లో చూసినట్టు పరమ రొటీన్‌గా ఉంది వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మీ ట్రైలర్..

యంగ్ జంట మధ్య రొమాన్స్, లిప్ లాక్, రాయ్ లక్ష్మీ గ్లామర్ తప్ప కొత్తగా ఏం లేదు చెప్పడానికి. మార్చిలో ఈజ్ ది వెంకటలక్ష్మీ రిలీజ్ కానుంది. అన్నపూర్ణమ్మ, కార్తీక్, పూజిత పొన్నాడ, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ : కిరణ్, కెమెరా : వెంకట్, ఎడిటింగ్ : ఎస్ఆర్ శేఖర్, సంగీతం : హరిగౌర, ఆర్ట్ : బ్రహ్మ కడలి, నిర్మాతలు : ఎమ్.శ్రీధర్ రెడ్డి, హెచ్.ఆనంద్ రెడ్డి మరియు ఆర్‌కె రెడ్డి. 

వాచ్ ట్రైలర్…