Ashok Galla : మేనల్లుడికి మహేష్ అభినందనలు..
మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా ఇంట్రడ్యూస్ అయిన ‘హీరో’ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది..
- sekhar
- Published on- January 15, 2022 / 08:46 PM IST
Hero
Ashok Galla: సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు జిల్లా ఏంపీ జయదేవ్ గల్లా తనయుడు అశోక్ గల్లా హీరోగా ‘హీరో’ సినిమాతో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అయిన సంగతి తెలిసిందే.
Mahesh Babu : మహేష్ బాబుకి కరోనా నెగెటివ్
యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు.. సూపర్‌స్టార్ కృష్ణ మరియు గల్లా అరుణ కుమారి సమర్పణలో, అమర రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై పద్మావతి గల్లా నిర్మించారు. ‘ఇస్మార్ట్ బ్యూటీ’ నిధి అగర్వాల్ కథానాయిక..
సంక్రాంతి కానుకగా జనవరి 15న ‘హీరో’ గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. సూపర్‌స్టార్ కృష్ణ, మహేష్ బాబు మరియు తెలుగు ప్రేక్షకులు సినిమా చూసి బాగుందని చెప్తున్నారు. ‘హీరో’ కి పాజిటివ్ టాక్ రావడంతో టీం సెలబ్రేషన్స్ చేసుకున్నారు. మేనల్లుడి ఫస్ట్ సినిమాకు మంచి టాక్ రావడంతో అశోక్‌తో సహా ‘హీరో’ యూనిట్ అందరకీ విషెస్ చెబుతూ మహేష్ ట్వీట్ చేశారు.
