చార్జ్‌డ్ విత్ థమ్స్‌అప్ పేరిట రిలీజ్ చేసిన ఒక్క నిమిషం యాడ్‌లో మహేష్ థమ్స్‌అప్ తాగి, ప్లెయిన్, పారాచ్యూట్‌తో సూపర్బ్ ఫీట్స్ చేసాడు..
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతోనే కాదు.. యాడ్ షూటింగ్స్‌తో కూడా బిజీగా ఉంటాడు. ఇప్పటి వరకు మహేష్ నటించిన పలు యాడ్స్, వాటి తాలూకు బ్రాండ్స్ సక్సెస్ అయ్యాయి. మహేష్ గతకొద్ది కాలంగా ఫేమస్ సాఫ్ట్ డ్రింక్ థమ్స్‌అప్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా ఈ ప్రొడక్ట్‌కి సంబంధించిన ఒక కొత్త యాడ్ రిలీజ్ చేసారు. ‘తాజావార్త.. ప్రముఖ న్యూస్ జర్నలిస్ట్ ముఖ్యమైన న్యూస్ ఫుటేజ్ తెస్తూ మాయమయ్యారు.. వారెక్కిన ప్లెయిన్ గల్లంతు’ అనే వాయిస్ ఓవర్‌తో స్టార్ట్ అయిన ఈ యాడ్.. సాలిడ్‌గా ఉంది.
చార్జ్‌డ్ విత్ థమ్స్‌అప్ పేరిట రిలీజ్ చేసిన ఒక్క నిమిషం యాడ్‌లో మహేష్ థమ్స్‌అప్ తాగి, ప్లెయిన్, పారాచ్యూట్‌తో సూపర్బ్ ఫీట్స్ చేసాడు. లొకేషన్, విజువల్స్ అల్టిమేట్‌గా ఉన్నాయి. చూస్తున్నంత సేపు ఏదో హాలీవుడ్ సినిమా ట్రైలర్ చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహేష్ 25వ సినిమా మహర్షి మే 9న విడుదల కానుంది.
వాచ్ వీడియో..