Sitara Ghattamaneni : ఓ షాప్ ఓపెనింగ్ కి సితార పాప.. ఉగాది నాడు.. ఏ టైంకి? ఎక్కడో తెలుసా?

సితార ఓ షాప్ ఓపెనింగ్ కి వెళ్లనుంది.

Sitara Ghattamaneni : ఓ షాప్ ఓపెనింగ్ కి సితార పాప.. ఉగాది నాడు.. ఏ టైంకి? ఎక్కడో తెలుసా?

Mahesh Babu Daughter Sitara Ghattamaneni Attends to a Shop Opening Details Here

Updated On : March 30, 2025 / 3:45 PM IST

Sitara Ghattamaneni : మహేష్ బాబు కూతురుగా సితార ఘట్టమనేని అందరికి పరిచయమే. అయినా సోషల్ మీడియాలో తన పోస్టులతో యాక్టివ్ గా ఉంటూ ఇప్పటికే ఓ యాడ్ చేసి, పలు సేవా కార్యక్రమాలు కూడా చేసి సితార సొంతంగా పేరు తెచ్చుకుంది. సితార ఘట్టమనేని తన ఫస్ట్ యాడ్ PMJ జ్యువెల్లర్స్ కి చేసిన సంగతి తెలిసిందే. ఆ యాడ్ బాగా వైరల్ అయింది.

ఇప్పుడు సితార ఓ షాప్ ఓపెనింగ్ కి వెళ్లనుంది. గతంలో యాడ్ చేసిన జ్యువెల్లర్స్ షోరూం మరో కొత్త బ్రాంచ్ న ఓపెన్ చేయనుంది. వీరికి బ్రాండ్ అంబాసిడర్ గా సితార ఘట్టమనేని ఉండటంతో తనే షాప్ ఓపెనింగ్ కి వస్తుంది. రేపు మార్చ్ 30 ఆదివారం ఉగాది నాడు ఉదయం పది గంటలకు హైదరాబాద్ పంజాగుట్టలోని కొత్త జ్యువెల్లర్స్ షోరూంని సితార ప్రారంభించనుంది.

Also See : Sitara Ghattamaneni : సితార పాప ట్రెడిషినల్ లుక్స్.. హాఫ్ శారీలో ఉగాది నాడు..

దీంతో మహేష్ అభిమానులు ఆమెని అభినందిస్తున్నారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకుండానే షాప్ ఓపెనింగ్స్, యాడ్స్ చేసేస్తోంది అని పొగుడుతున్నారు. ఇక హైదరాబాద్ లో ఉన్న మహేష్ అభిమానులు రేపు సితార పాపని చూడటానికి ఆ షాప్ ఓపెనింగ్ కి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు. రేపు అక్కడికి భారీగా మహేష్ ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉందని సమాచారం.

Mahesh Babu Daughter Sitara Ghattamaneni Attends to a Shop Opening Details Here