SSMB 29 : మహేష్ రాజమౌళి సినిమా కథ ఆ బుక్స్ నుంచి తీసుకొని రాశారా? విజయేంద్రప్రసాద్ వ్యాఖ్యలు వైరల్..

మహేష్ రాజమౌళి సినిమా ట్రెజర్ హంట్, యాక్షన్ అడ్వెంచర్ సినిమాలాగా ఉంటుందని ఆల్రెడీ రాజమౌళి చెప్పారు.

SSMB 29 : మహేష్ రాజమౌళి సినిమా కథ ఆ బుక్స్ నుంచి తీసుకొని రాశారా? విజయేంద్రప్రసాద్ వ్యాఖ్యలు వైరల్..

Mahesh Babu Rajamouli SSMB 29 Movie Update

SSMB 29 Movie : RRR సినిమా తర్వాత రాజమౌళి(Rajamouli) మహేష్ బాబుతో(Mahesh Babu) సినిమా చేస్తున్నారు అని తెలియడంతో ఈ సినిమాపై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సారి పాన్ వరల్డ్ రేంజ్ లో సినిమా చేస్తున్నారని అంతా భావిస్తున్నారు. ఇక ఈ సినిమా ట్రెజర్ హంట్, యాక్షన్ అడ్వెంచర్ సినిమాలాగా ఉంటుందని ఆల్రెడీ రాజమౌళి చెప్పారు.

ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయని, కథ కూడా పూర్తయిందని విజయేంద్రప్రసాద్ కూడా కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇక ఈ సినిమాకు బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ రాస్తున్నారని సమాచారం. తాజాగా మహేష్ – రాజమౌళి సినిమా గురించి మరో అప్డేట్ వినిపిస్తుంది.

Also Read : Pooja Hegde : నిజంగా అతను పూజ హెగ్డే బాయ్ ఫ్రెండేనా? ఎవరీ రోహన్ మెహ్రా..?

విజయేంద్రప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు, రాజమౌళికి దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్‌ స్మిత్‌ రచనలు ఇష్టం. ఆయనకు మేమిద్దరం అభిమానులం. ఆయన పుస్తకాలన్నీ చదివాం. వాటి ఆధారంగా ఈ సినిమా స్క్రిప్ట్ రాసుకున్నాను అని తెలిపారు. అయితే ఇది ఒక బుక్ నంచి రాసుకున్న కథ కాదని, చాలా బుక్స్ చదివి ఒక ఊహాత్మక కథ రాసుకున్నారని తెలుస్తుంది. దీంతో మహేష్ – రాజమౌళి సినిమా అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా ఉండబోతుందని ఇప్పట్నుంచే అభిమానులు, సినీ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు. ఇక అభిమానులు అయితే అధికారికంగా సినిమా పూజా కార్యక్రమం ఎప్పుడు మొదలుపెడతారా అని ఎదురుచూస్తున్నారు.