Mahesh Babu : షర్ట్ లేకుండా మహేష్ బాబు.. వారణాసి నుంచి మహేష్ బర్త్ డే స్పెషల్ అదేనా?
ఇప్పుడు మహేష్ పుట్టిన రోజు వస్తుండటంతో వారణాసి సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ వస్తుందని అంటున్నారు.
Mahesh Babu
Mahesh Babu : మహేష్ బాబు పుట్టిన రోజు రాబోతుంది. ఆగస్టు 9 సూపర్ స్టార్ మహేష్ పుట్టిన రోజు కావడంతో ఫ్యాన్స్ ఈసారి మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దానికి కారణం వారణాసి. వారణాసి సినిమా నుంచి ఇప్పటివరకు ఒక గ్లింప్స్ మాత్రమే రిలీజ్ చేసారు. మహేష్ బాబు పాత్రని రుద్రగా పవర్ ఫుల్ గా పరిచయం చేయడంతో ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీ.
ఇప్పుడు మహేష్ పుట్టిన రోజు వస్తుండటంతో వారణాసి సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ వస్తుందని అంటున్నారు. గ్లింప్స్ రిలీజ్ చేస్తారని రూమర్స్ కూడా వచ్చాయి. కానీ టాలీవుడ్ సమాచారం ప్రకారం కేవలం మహేష్ బాబుకు సంబంధించి ఒక పోస్టర్ మాత్రమే రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. అది కూడా మహేష్ బాబు షర్ట్ లేకుండా వారణాసి సినిమా లోని ఓ లుక్స్ ని రిలీజ్ చేస్తారని టాక్ నడుస్తుంది.
Also Read : Varun Tej : ఆమె గత జన్మలో కొరియన్.. హీరోయిన్ పై వరుణ్ తేజ్ కామెంట్స్..
చాలా మంది హీరోలు షర్ట్ లేకుండా, సిక్స్ ప్యాక్ లు చూపిస్తూ సినిమాలు చేసారు. కానీ మహేష్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా షర్ట్ తీసేసి ఏ సినిమాలోనూ కనిపించలేదు. ఇటీవల కొన్ని రోజుల క్రితం మహేష్ షర్ట్ లేకుండా స్విమ్మింగ్ చేస్తున్న ఫొటోని నమ్రత శిరోద్కర్ షేర్ చేయడంతో ఆ ఫోటో వైరల్ గా మారింది. ఇప్పుడు మొదటిసారి వారణాసి సినిమాలో మహేష్ బాబు షర్ట్ లెస్ గా కనిపించబోతున్నాడు అని తెలుస్తుంది. అందుకే బర్త్ డే కి షర్ట్ లెస్ ఫోటో రిలీజ్ చేసి ఫ్యాన్స్ కి మరింత హైప్ ఇవ్వనున్నారట.
వారణాసి గ్లింప్స్ ఈవెంట్లో కూడా మహేష్ మాట్లాడుతూ.. రాజమౌళి నా షర్ట్ బటన్స్ తీసేయమన్నాడు. నేను షర్ట్ బటన్స్ ఫుల్ గా పెట్టుకుంటాను అంటే వద్దన్నాడు అని చెప్పుకొచ్చాడు. దీంతో సినిమాలో రాజమౌళి కచ్చితంతా మహేష్ తో షర్ట్ లేకుండా ఒక్క సీన్ అయినా చేయించి ఉంటాడని అనుకుంటున్నారు. మరి నిజంగానే మహేష్ పుట్టిన రోజు నాడు వారణాసి నుంచి మహేష్ షర్ట్ లెస్ పోస్టర్ వస్తుందా చూడాలి.
