Sitara Ghattamaneni : వామ్మో ఈ ఏజ్ లోనే.. జిమ్‌లో సితార పాప ఏ రేంజ్‌లో కష్టపడుతుందో చూడండి..
సితార జిమ్ లో కష్టపడుతున్న ఫోటోలు వైరల్ గా మారాయి.

Mahesh Daughter Sitara Ghattamaneni Gym Photos goes Viral
Sitara Ghattamaneni : మహేష్ కూతురు సితార అందరికి పరిచయమే. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటూ ఫోటోలు పోస్ట్ చేస్తూ వైరల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడే యాడ్స్ లో నటిస్తూ, సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి మన్ననలు పొందుతుంది సితార. ఇక సితార ఫోటోలు షేర్ చేసిందంటే అవి వైరల్ అవ్వాల్సిందే. నిన్న జులై 20 సితార పుట్టిన రోజు కావడంతో సెలబ్రిటీలు, మహేష్ అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలిపారు.
Also Read : Sitara Ghattamaneni : బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసుకున్న సితార.. నమ్రతా పోస్ట్ చూశారా..?
ఇక సితార ఇంట్లోనే ఫ్యామిలీతో తన బర్త్ డే సెలబ్రేషన్స్ చేసింది. అయితే సితార ఈ ఏజ్ లోనే జిమ్ లో చాలా కష్టపడుతుంది. నిన్న సితార పుట్టిన రోజు కావడంతో తన జిమ్ ట్రైనర్ సితార జిమ్ లో యోగాసనాలు చేస్తున్న ఫోటోలు షేర్ చేసి విషెష్ చెప్పింది. దీంతో సితార జిమ్ లో కష్టపడుతున్న ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఇవి చూసి ఈ ఏజ్ లోనే సితార జిమ్ లో ఇంత కష్టపడుతుంది అని అభినందిస్తున్నారు.