Toxic : టాక్సిక్ నుంచి మరో సాంగ్ వచ్చేసింది.. ‘మనసాగదే..’
టాక్సిక్ (Toxic ) మూవీ నుంచి ఇప్పటికే తబాయి పాటను విడుదల చేయగా.. తాజాగా మనసాగదే పాటను రిలీజ్ చేశారు.
Manasaagadhe song form yash Toxic out now
Toxic : కేజీఎఫ్ తరువాత యశ్ నటిస్తున్న చిత్రం టాక్సిక్. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. నయనతార, రుక్మిణి వసంత్, తార సుతారియా, హ్యూమా ఖురేషి, కియారా అద్వానీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆగస్టు 26న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది.
అందులో భాగంగా ఈ చిత్రంలోంచి ఒక్కొ పాటను విడుదల చేస్తోంది. ఇప్పటికే తబాయి పాటను విడుదల చేయగా.. తాజాగా మనసాగదే పాటను రిలీజ్ చేశారు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా తనిష్ బాగ్చీ, అర్ల్సాన్ నిజామి. ఫహీమ్ అబ్దుల్లా స్వరాలు సమకూర్చాడు. సిద్ధార్థ్ బ్రసూర్ పాడారు.
Rashi Singh : పూల అందంతో పరిమళిస్తున్న రాశి సింగ్.. ఫోటోలు..
