MAA Elections : కృష్ణను కలిసిన మోహన్ బాబు, విష్ణు

నామినేషన్ల విత్ డ్రా, స్క్రూటినీ తంతు కొనసాగుతోంది. జనరల్ సెక్రటరీ పదవికి వేసిన నామినేషన్ ను వెనక్కి తీసుకున్నారు బండ్ల గణేశ్.

MAA Elections : మా ఎన్నికలకు తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ప్రచార వేడి పెరుగుతోంది. ప్యానెళ్ల వారీగా… సినీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణను  మంచు మోహన్ బాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో… మంచు విష్ణు, నరేష్ సహా…. వారి ప్యానెల్ సభ్యులు పాల్గొన్నారు. మా ఎన్నికల్లో గెలిస్తే తాము ఏం చేయదల్చుకున్నామో  ఆ అంశాలను కృష్ణకు వివరించారు. కృష్ణతో విష్ణుప్యానెల్ సభ్యులు గ్రూప్ ఫొటో దిగారు.

టాలీవుడ్ లెజెండరీ నటుడు కృష్ణతో ఆయన ఇంట్లో మోహన్ బాబు భేటీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల్లో ప్యానెల్ ను ప్రకటించక ముందే.. ఓసారి మోహన్ బాబు, విష్ణు కలిసి ముచ్చటించారు. తమ ప్యానెల్ కు మద్దతుగా నిలవాలని కోరారు.

MAA Elections 2021 : ‘మా’ ఎన్నికల బరి నుంచి తప్పుకున్న బండ్ల గణేష్..

మా ఎన్నికల్లో మంచు విష్ణు తరఫున అన్నీ తానై మోహన్ బాబు వ్యవహరిస్తున్నారు. మరోవైపు.. అటు ప్రకాశ్ రాజ్ టీమ్ కు మెగా ఫ్యామిలీ మద్దతు మెండుగా ఉందని ఇండస్ట్రీ టాక్. సో .. మరోసారి.. టాలీవుడ్ చిరకాల మిత్రులైన చిరంజీవి, మోహన్ బాబు ఇండైరెక్ట్ వార్ జరుగుతోంది టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.

అక్టోబర్ పదో తేదీన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరగబోతున్నాయి. నామినేషన్ల విత్ డ్రా, స్క్రూటినీ తంతు కొనసాగుతోంది. జనరల్ సెక్రటరీ పదవికి వేసిన నామినేషన్ ను వెనక్కి తీసుకున్నారు బండ్ల గణేశ్. శ్రేయోభిలాషుల సూచనతో.. బరి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. అక్టోబర్ 10న ఉదయం 8 గంటల నుంచి… మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం ఏడు గంటల వరకు ఫలితాలు ప్రకటించనున్నారు.

మా ఫైట్… ప్రకాశ్ రాజ్ vs మంచు విష్ణు

ట్రెండింగ్ వార్తలు