Coolie : రజినీకాంత్ – నాగార్జున ‘కూలీ’ మూవీ రివ్యూ.. నాగార్జున విలన్ గా చేసిన సినిమా..

 సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ మెయిన్ లీడ్ లో, నాగార్జున మొదటి సారి విలన్ గా నటించిన సినిమా 'కూలీ'(Coolie).

Coolie : రజినీకాంత్ – నాగార్జున ‘కూలీ’ మూవీ రివ్యూ.. నాగార్జున విలన్ గా చేసిన సినిమా..

Coolie

Updated On : August 14, 2025 / 2:39 PM IST

Coolie Movie Review : సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ మెయిన్ లీడ్ లో, నాగార్జున మొదటి సారి విలన్ గా నటించిన సినిమా ‘కూలీ’. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మాణంలో లోకేశ్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో ఆమీర్‌ ఖాన్‌, శృతిహాసన్‌, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, పూజాహెగ్డే, సత్యరాజ్.. లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటించారు. కూలీ సినిమా నేడు ఆగ‌స్టు 14న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అయింది.

కథ విషయానికొస్తే.. సైమన్ (నాగార్జున) విశాఖ పోర్టుని ఆధీనంలో పెట్టుకుని లాజిస్టిక్స్ పేరుతో బంగారం, లగ్జరీ వాచ్ లు స్మగ్లింగ్ చేస్తుంటాడు. అతని కోసం పనిచేసే దయాళ్ (సౌబిన్ షాహిర్) అందర్నీ భయపెడుతూ, చంపుతూ ఉంటాడు. ఈ క్రమంలో సైమన్ కోసం పనిచేసే రాజశేఖర్ (సత్యరాజ్) మరణిస్తాడు. ఈ విషయం తెలిసి చెన్నైలో ఉన్న రాజశేఖర్ ఫ్రెండ్ దేవా (రజినీకాంత్) వైజాగ్‌కి వస్తాడు. రాజశేఖర్ పెద్ద కూతురు ప్రీతి (శ్రుతి హాసన్)కు ప్రమాదం ఉందని దేవా తెలుసుకుంటాడు.

అలాగే రాజశేఖర్ ది సహజ మరణం కాదని, ఈ స్మగ్లింగ్ వెనక సైమన్ ఇంకేదో చేస్తున్నాడని అనుమానించి, తన ఫ్రెండ్ ఎలా చనిపోయాడా అని ఇవన్నీ కనిపెట్టడానికి సైమన్ దగ్గర కూలీగా జాయిన్ అవుతాడు. అసలు రాజశేఖర్ ఎలా చనిపోయాడు? దేవా – రాజశేఖర్ ఫ్లాష్ బ్యాక్ లో ఏం చేసారు? దయాల్ ఎవరు? దేవాకి – సైమన్‌కు ఉండే లింక్ ఏంటి? సైమన్ స్మగ్లింగ్ కాకుండా ఇంకేం చేస్తున్నాడు? ఈ కథలో కాలేషా (ఉపేంద్ర), దాహా (ఆమిర్ ఖాన్) పాత్రలు ఏంటి తెలియాలంటే తెరపై చూడాల్సిందే..

Also Read : War 2 : ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ ‘వార్ 2’ మూవీ రివ్యూ.. బాలీవుడ్ యాక్షన్ సినిమా..

సినిమా విశ్లేషణ.. దేవా, సైమన్ పాత్రల పరిచయాలతో సింపుల్ గా మొదలవుతుంది. ఫ్రెండ్ మరణంతో దేవా ఎంట్రీ ఇచ్చాకా ఏం చేస్తాడు అనే ఆసక్తి నెలకొంటుంది. శృతి హాసన్ రజినీకాంత్ మధ్య కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉన్నా అవి అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్‌లో షోబిన్, మోనిక సాంగ్, హాస్టల్ ఫైట్ ఇలా అన్నీ బాగానే ఉంటాయి. ఇంటర్వెల్‌కు ఇచ్చిన ట్విస్ట్ అదిరిపోతుంది. దీంతో సెకండ్ హాఫ్ పై ఆసక్తి నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో కొన్ని ట్విస్టులు బాగానే వర్కౌట్ అవుతాయి.

ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఇప్పటి కథకు కనెక్ట్ చేయడం, ఫ్లాష్ బ్యాక్ లో యాక్షన్ సీన్స్ అన్ని బాగానే రాసుకున్నారు. ఫ్లాష్ బ్యాక్ లో 90వ దశకంలో కనిపించినట్టుగా రజినీకాంత్‌ను లోకేష్ అద్భుతంగా చూపించాడు. రజినీకాంత్ కి స్లో మోషన్ లో భారీ ఎలివేషన్స్ ఊహిస్తారు ఫ్యాన్స్. ఆ విషయంలో మాత్రం నిరాశ తప్పదు. రజినీకాంత్ కి ఇంకొన్ని ఎలివేషన్స్ ఇస్తే బాగుండేది. నాగార్జున నెగిటివ్ రోల్ అయినా అతని కింద ఉండే సౌభిన్ పాత్ర కథ మొత్తం నడిపిస్తున్నాడు అనిపిస్తుంది. నాగార్జునకు కొన్ని సీన్స్ డైరెక్ట్ గా నెగిటివ్ షేడ్స్ లో పడుంటే బాగుండేది. నాగార్జున పాత్ర ముగింపు సింపుల్ గా అయిపోయింది అనిపిస్తుంది. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లింక్ ఉంటుందేమో అని అనుకుంటే నిరాశ తప్పదు. లోకేష్ సినిమా అంటే అందరికి ఒక అంచనాలు ఉంటాయి కానీ ఇది లోకేష్ మార్క్ సినిమా కాదేమో అని సందేహం రాక మానదు.(Coolie)

Coolie

నటీనటుల పర్ఫార్మెన్స్.. రజినీకాంత్ ఎప్పట్లాగే తన స్టైలిష్ మార్క్ తో మెప్పించాడు. ఏజ్ పెరుగుతున్నా ఇంకా ఈ రేంజ్ లో కష్టపడుతున్నారంటే హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇక నాగార్జున మొదటిసారి పూర్తిగా నెగిటివ్ షేడ్స్ లో బాగానే మెప్పించారు. నాగ్ విలనిజం కొత్తగా ఉంటుంది. సౌబిన్ షాహిర్ సినిమా అంతా హైలెట్ గా నిలుస్తాడు. ఈ సినిమాతో సౌబిన్ రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉంది.

రుచిత రామ్ కూడా తన నటనతో మెప్పిస్తుంది. శృతి హాసన్ అక్కడక్కడా కనిపించి ఎమోషనల్ సీన్స్ లో పర్వాలేదనిపిస్తుంది. ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ గెస్ట్ అప్పీరెన్స్ లు బాగానే ఉంటాయి. సత్యరాజ్ కి కూడా మంచి పాత్రే పడింది. రెబా మోనికా, పూజ హెగ్డే.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.

Also Read : Constable Kanakam : ‘కానిస్టేబుల్ కనకం’ వెబ్ సిరీస్ రివ్యూ.. ఊళ్ళో అమ్మాయిలు మిస్సింగ్..

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం బాగున్నాయి. అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేసాడు. పాటలు మాత్రం యావరేజ్. 90s బ్యాక్ డ్రాప్ విజువల్స్ బాగా చూపించారు. కాస్ట్యూమ్ డిజైనర్ నాగార్జునని చాలా స్టయిలిష్ గా చూపించారు. మిగతా పాత్రలకు కూడా కాస్ట్యూమ్స్ వాళ్లకు తగ్గట్టు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేలా చూసుకున్నారు. ఎడిటింగ్ లో ఇంకాస్త షార్ప్ కట్స్ చేయాల్సింది. కథ రొటీన్ అనిపించినా నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే తో కొత్తగా చూపించే ప్రయత్నం చేసారు. నిర్మాణ పరంగా మాత్రం ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై అనిపిస్తుంది.

మొత్తంగా ‘కూలీ’ సినిమా తన స్నేహితుడి మరణానికి పగ తీర్చుకునేందుకు వచ్చిన ఓ కూలీ కథ. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.