War 2 : ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ ‘వార్ 2’ మూవీ రివ్యూ.. బాలీవుడ్ యాక్షన్ సినిమా..

ఎన్టీఆర్ మొదటి సారి బాలీవుడ్ సినిమాలో నటించడంతో ఈ సినిమాపై తెలుగులో కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి.(War 2)

War 2 : ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ ‘వార్ 2’ మూవీ రివ్యూ.. బాలీవుడ్ యాక్షన్ సినిమా..

War 2

Updated On : August 14, 2025 / 1:52 PM IST

War 2 Movie Review : హృతిక్ రోషన్ – ఎన్టీఆర్(NTR) మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన బాలీవుడ్ సినిమా ‘వార్ 2’. య‌శ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మాణంలో అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెరకెక్కింది. కియారా అద్వాణీ హీరోయిన్ గా నటించింది. వార్ 2 సినిమా నేడు ఆగ‌స్టు 14న పాన్ ఇండియా వైడ్ రిలీజయింది.

కథ విషయానికొస్తే.. ఇండియాలో బెస్ట్ రా సోల్జర్ కబీర్(హృతిక్ రోషన్). ఇండియాను అంతం చేయడానికి కొన్ని దేశాలు ఇండియాలోని కొంతమంది తో కలిసి కలి కార్టెల్ ను మొదలుపెట్టడంతో దాన్ని అంతం చేయడానికి కబీర్ వాళ్ళ రూట్ లోకి వెళ్తాడు. ఈ క్రమంలో కబీర్ దేశ ద్రోహిగా మారతాడు. తనను పెంచిన లూథ్రాని(అశుతోష్ రానా) కూడా చంపాల్సి వస్తుంది కబీర్. దీంతో లూథ్రా కూతురు, ఎయిర్ ఫోర్స్ లో బెస్ట్ వింగ్ కమాండర్ కావ్య లూథ్రా(కియారా అద్వానీ) తన తండ్రిని చంపిన కబీర్ ను చంపాలని రా లో చేరుతుంది.

కబీర్ ను అంతం చేయడానికి కాల్(అనిల్ కపూర్) లీడ్ లో బెస్ట్ ఏజెంట్ విక్రమ్(ఎన్టీఆర్) ను తీసుకుంటారు. దీంతో విక్రమ్, కావ్య కలిసి కబీర్ ను చంపడానికి వెళ్తారు. కానీ కబీర్ ను కలి కార్టెల్ మోసం చేసిందని తెలుస్తుంది. కలి కార్టెల్ దేశ ప్రధానిని చంపడానికి ప్రయత్నిస్తారు. మరి దేశ ప్రధానిని ఎవరు కాపాడతారు, అసలు విక్రమ్ ఎవరు? కబీర్ కి – విక్రమ్ కు ఉన్న సంబంధం ఏంటి? కబీర్ ఎందుకు లూథ్రాని చంపాల్సి వస్తుంది? కబీర్ ని కలి కార్టెల్ ఎలా మోసం చేసింది? కలి కార్టెల్ ను అంతం చేశారా? ఇవన్ని తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే..

Also Read : Coolie Twitter Review : కూలీ ట్విట్ట‌ర్ రివ్యూ.. విల‌న్‌గా నాగార్జున మెప్పించాడా?

సినిమా విశ్లేషణ.. ఎన్టీఆర్ మొదటి సారి బాలీవుడ్ సినిమాలో నటించడం, అది కూడా బాలీవుడ్ ఫేమస్ YRF స్పై యూనివర్స్ లో నటించడంతో ఈ సినిమాపై తెలుగులో కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే వార్ 2 రెగ్యులర్ స్పై యాక్షన్ సినిమా. అన్ని స్పై యాక్షన్ సినిమాల్లాగే ఒక బెస్ట్ సోల్జర్ దేశాన్ని కాపాడటం కోసం దేశ ద్రోహిగా మారడం, హీరో అనుకున్న వాళ్ళు విలన్ అవ్వడం, విలన్ అనుకున్న వాళ్ళు హీరో అవ్వడం, మంచోళ్ళు అనుకున్న వాళ్ళు విలన్ సైడ్ ఉండటం, చెడ్డోళ్లు అనుకున్న వాళ్ళు దేశం కోసం నిలబడటం.. ఇలా రొటీన్ ట్విస్ట్ లతో సాగుతుంది. మధ్యలో హీరో – హీరోయిన్ కి ఓ లవ్ స్టోరీ, వాళ్ళ మధ్య ఓ మిస్ అండర్ స్టాండింగ్. ఇలా రొటీన్ కథ కథనమే.

యాక్షన్ సీక్వెన్స్ లను మాత్రం నీళ్ళల్లో, గాలిలో, ట్రైన్ మీద, మంచులో, మంటల్లో.. ఇలా రకరకాలుగా గ్రాండ్ గానే ప్లాన్ చేసారు. ఎన్టీఆర్ కి ఇచ్చిన ఎలివేషన్స్ మాత్రం అదిరిపోయాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ. కొన్ని ఛేజింగ్ సీన్స్ తప్ప సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎక్కడా మెయింటైన్ చేయలేకపోయారు. బాలీవుడ్ లో వచ్చే రొటీన్ స్పై యాక్షన్ సినిమాలాగే వార్ 2 కూడా ఉంది. బాలీవుడ్ లో అయితే ఆడుతుంది. ఇక్కడ ఎన్టీఆర్ అదరగొట్టాడు కాబట్టి యాక్షన్ సీన్స్ కోసమైనా చూసేయొచ్చు. ఫ్లాష్ బ్యాక్ కూడా చాలా రొటీన్. కానీ ఫ్లాష్ బ్యాక్ లో ఒక చిన్న పాయింట్ ని పట్టుకొని ఈగోతో సినిమా అంతా క్యారెక్టర్ సాగదీసి చివర్లో సింపుల్ గా మారిపోవడం అంత కన్వినెన్స్ గా ఉండదు.

war 2

నటీనటుల పర్ఫార్మెన్స్.. హృతిక్ రోషన్ ఎప్పట్లాగే తన బాడీ చూపిస్తూ యాక్షన్ సీన్స్ లో పర్ఫెక్ట్ గా మెప్పించాడు. ఎన్టీఆర్ కి మొదటిసారి ఈ రేంజ్ స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ లు పడటంతో అదరగొట్టాడు. ఎన్టీఆర్ లుక్స్ కూడా కొత్తగా ఉన్నాయి. ఎమోషనల్ సీన్స్ లోను ఎన్టీఆర్ మెప్పించాడు. కియారా అద్వానీ అందాల ఆరబోతలోనే కాకుండా యాక్షన్ తోను మెప్పించింది. అనిల్ కపూర్, అశుతోష్ రానా రా చీఫ్ పాత్రల్లో బాగా నటించారు. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు. ఫ్లాష్ బ్యాక్ లో నటించిన ఇద్దరు పిల్లలు మాత్రం తమ నటనతో అదరగొట్టేసారు.

Also Read : War 2 Twitter Review : ‘వార్ 2’ ట్విట్టర్ రివ్యూ.. ఎన్టీఆర్ కుమ్మేశాడ‌ట‌..

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. పాటల గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది. ఈ సినిమాకు యాక్షన్ సీక్వెన్స్ చాలా ప్లస్ అయ్యాయి. వివిధ దేశాల్లో యాక్షన్, ఛేజింగ్ సీక్వెన్స్ లు బాగా డిజైన్ చేసుకున్నారు. లొకేషన్స్ కూడా చాలా దేశాలు తిప్పి కొత్త కొత్త లొకేషన్స్ చాలానే చూపించారు. రొటీన్ కథ కథనంతో కేవలం యాక్షన్ సీక్వెన్స్ లు, కాస్త ఎమోషన్ తో నడిపించాడు డైరెక్టర్. నిర్మాణ పరంగా మాత్రం ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు ప్రతి ఫ్రేమ్ లోను కనిపిస్తుంది.

మొత్తంగా ‘వార్ 2’ సినిమా యాక్షన్ ఎమోషన్ తో సాగిన స్పై యాక్షన్ థ్రిల్లర్. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.