Thiruveer: సినిమా వల్ల నా తల్లిదండ్రుల కర్మకాండలు చేయలేకపోయాను.. తిరువీర్ ఎమోషనల్ కామెంట్స్
సినిమా షూటింగ్ షెడ్యూల్స్, లుక్ కంటిన్యూటీ వల్ల తన తల్లితండ్రులకు కర్మకాండలు చేయలేకపోయాను అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసిన తిరువీర్(Thiruveer).
masooda fame thiruveer emotional comments about his parents
- సినిమా కోసం పేరెంట్స్ కర్మకాండలకు దూరం
- చుట్టాల నుంచి విమర్శలు
- ఆ గిల్ట్ ఎప్పటికీ ఉంటుందన్న తిరువీర్
Thiruveer: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ ప్రస్తుతం ‘పాపం ప్రతాప్’ అనే వినూత్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. తిరువీర్ తన సహజ సిద్ధమైన నటనతో ఈ సినిమాలో ఒక విభిన్నమైన పాత్రలో కనిపించాడు. అయితే, ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో తిరువీర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
God Of War: ‘గాడ్ ఆఫ్ వార్’ మూవీ ఫిక్స్.. ఆరోజే అప్డేట్ కన్ఫర్మ్
పాపం ప్రతాప్ సినిమా షూటింగ్ షెడ్యూల్స్, లుక్ కంటిన్యూటీ సమస్యల వల్ల తన తల్లిదండ్రుల అంత్యక్రియలు, తర్వాతి క్రతువులను (కర్మకాండలు) సరిగ్గా నిర్వహించలేకపోయానని తిరువీర్ (Thiruveer)ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. షూటింగ్ మధ్యలో జుట్టు కత్తిరించుకోవడం, లుక్ చేంజ్ చేయడం వల్ల మూవీ కంటిన్యూటీ దెబ్బతింటుందని, ఆ వృత్తిపరమైన నిబద్ధత వల్ల కన్నవారికి చేయాల్సిన కనీస ధర్మాలను పూర్తి చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల చుట్టాల నుంచి “ఒక్కడే కొడుకువై ఉండి కనీసం ఈ మాత్రం కూడా చేయలేవా?” అనే విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.
వృత్తి పట్ల ఉన్న అంకితభావం తనను వ్యక్తిగతంగా ఎంతటి వేదనకు గురిచేసిందో వివరిస్తూ, ఆ గిల్ట్ (అపరాధ భావం) తనను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుందని తిరువీర్ పేర్కొన్నారు. ఒక నటుడిగా బయటకు నవ్వుతూ కనిపిస్తున్నా, లోపల ఇటువంటి ఎన్నో త్యాగాలు, బాధలు ఉంటాయని ఆయన మాటలు ప్రతిబింబిస్తున్నాయి. ‘పాపం ప్రతాప్’ సినిమా విజయం సాధించాలని కోరుకుంటూనే, తన తల్లిదండ్రుల విషయంలో పడ్డ ఆ వేదనను ఆయన ఈ సందర్భంగా అభిమానులతో పంచుకున్నారు. ఆయన పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం ఈ సినిమా రూపంలో దక్కాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం తిరువీర్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
