Karthi-Boyapati: అల్లు అర్జున్ ప్లేస్ లో కార్తీ.. మాస్ కాంబో సెట్ చేస్తున్న బోయపాటి శ్రీను
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను హీరో కార్తీ(Karthi-Boyapati)తో ఒక మాస్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు.
mass director boyapati srinu doing a movie with tamil star karthi
- బోయపాటి అడ్డాలోకి హీరో కార్తీ ఎంట్రీ.
- భారీ పాన్ ఇండియా యాక్షన్ డ్రామా.
- మాస్ ఎలివేషన్లతో రికార్డులు తిరగరాయడం ఖాయం.
Karthi-Boyapati: మాస్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను, కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ కాంబినేషన్లో ఒక భారీ ప్రాజెక్టు పట్టాలెక్కబోతోంది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, కథలో ఇంటెన్స్ ఎమోషన్స్‌ను పండించడంలో కార్తీకి మంచి గుర్తింపు ఉంది. మరోవైపు, హీరోలను వెండితెరపై అత్యంత పవర్ఫుల్ మాస్ లుక్‌లో ప్రెజెంట్ చేయడంలో బోయపాటిది ప్రత్యేక శైలి. ఈ ఇద్దరు దిగ్గజాల కలయికలో సినిమా రాబోతుందన్న వార్త ప్రస్తుతం ఫిల్మ్ నగర్ వర్గాల్లో, సోషల్ మీడియాలో భారీ అంచనాలను పెంచుతోంది.
Anshu: మన్మథుడు హీరోయిన్ అన్షు.. ఎలా మారిపోయిందో చూశారా.. లేటెస్ట్ ఫోటోలు వైరల్
అయితే, అల్లు అర్జున్‌తో చేయాల్సిన ప్రాజెక్ట్ ప్రస్తుతానికి ఆలస్యం కావడంతో, బోయపాటి ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా కార్తీ(Karthi-Boyapati)తో ఈ పాన్ ఇండియా సినిమాను ప్లాన్ చేశారు. ఇందులో బోయపాటి మార్క్ మాస్ ఎలివేషన్లతో పాటు, కార్తీ తనదైన ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్తో మెప్పించబోతున్నారు. ఈ సినిమా పవర్ఫుల్ ఫ్యామిలీ లేదా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే భారీ యాక్షన్ డ్రామాగా ఉండబోతున్నట్లు సమాచారం. టాలీవుడ్ మాస్ మేకింగ్, కోలీవుడ్ యాక్టింగ్ పవర్ కలిస్తే బాక్సాఫీస్ వద్ద విధ్వంసం ఖాయమని సినీ ప్రియులు భావిస్తున్నారు.
ఈ క్రేజీ కాంబో సెట్స్ పైకి వెళ్తే రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక హీరో కార్తీకి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉండటం ఈ ప్రాజెక్టుకు ప్లస్ పాయింట్ కానుంది. బోయపాటి తన గత చిత్రాలైన అఖండ, స్కంద తరహాలోనే ఈ సినిమాలో కూడా హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లను ప్లాన్ చేస్తున్నారట. టాలీవుడ్, కోలీవుడ్ కలయికలో రాబోతున్న ఈ ‘బ్లాస్ట్’ మూవీపై త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానుంది.
