మెగాస్టార్ ఇంటికి పిలిస్తే.. మాటలొస్తాయా మరి!
- sekhar
- Published On : July 20, 2020 / 03:46 PM IST
సత్యదేవ్, నందితా శ్వేత హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘బ్లఫ్ మాస్టర్’. తమిళ్ సినిమా ‘సతురంగ వేట్టై’ కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం 2018లో విడుదలైంది. తాజాగా ఈ చిత్ర దర్శకుడిని మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. అదేంటి అప్పుడెప్పుడో సినిమా విడుదలైతే.. ఇప్పుడు ఆ చిత్ర దర్శకుడిని చిరంజీవి మెచ్చుకోవడం ఏమిటి? అనుకుంటున్నారా.. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో తెలియంది కాదు. అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ ఖాళీ టైమ్‌లో ఇంట్లోనే చిరంజీవి పలు సినిమాలను వీక్షిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన ‘బ్లఫ్ మాస్టర్’ చిత్రాన్ని చూడటం జరిగింది.
