Aarambham : ఓటీటీలోకి వచ్చేసిన ఎమోషనల్ సైన్స్ ఫిక్షన్ ‘ఆరంభం’..

మే 10న థియేటర్స్ లో రిలీజయిన ఆరంభం ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చింది.

Aarambham : ఓటీటీలోకి వచ్చేసిన ఎమోషనల్ సైన్స్ ఫిక్షన్ ‘ఆరంభం’..

Mohan Bhagat Aarambham Movie Streaming in OTT Full details here

Aarambham : కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ఎమోషనల్ సైన్స్ ఫిక్షన్ ‘ఆరంభం’. ఏవీటీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అభిషేక్ వీటీ నిర్మాణంలో అజయ్ నాగ్ వి దర్శకత్వంలో ఆరంభం సినిమా తెరకెక్కింది. మే 10న థియేటర్స్ లో రిలీజయిన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చింది.

ప్రస్తుతం ఆరంభం సినిమా భవానీ మీడియా ద్వారా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. టైమ్ ట్రావెల్, డెజావూ.. లాంటి ఆసక్తికర అంశాలతో ఈ సినిమా తెరకెక్కించారు. ఇలాంటి సైన్స్ ఫిక్షన్ లో అమ్మ సెంటిమెంట్ కూడా చాలా బాగా చూపించారు.

Also Read : మొదటి షెడ్యూల్‌లో మహేశ్ బాబు పాల్గొంటాడా? లేదా?

ఆరంభం సినిమా కథ విషయానికొస్తే.. కాలాఘటి అనే జైలులో మిగిల్(మోహన్ భగత్) ఓ మర్డర్ కేసు మీద రెండున్నరేళ్లుగా ఉంటాడు. రేపు ఉదయం అతన్ని ఉరి తీస్తారు అనగా జైలు నుంచి మాయమవుతాడు. అతని సెల్ కి వేసిన తాళాలు వేసినట్టే ఉంటాయి, గోడలు అలాగే ఉంటాయి అసలు బయటకి రావడానికి ఆస్కారమే లేని జైలు నుంచి ఎలా మాయమయ్యాడు అని పోలీసులు తలలు పట్టుకుంటారు. దీని గురించి కనిపెట్టడానికి ఓ డిటెక్టివ్ ని(రవీంద్ర విజయ్) పిలుస్తారు. మిగిల్ కి చెందిన ఓ బుక్ ఆ జైలు సెల్ లో దొరుకుతుంది. ఆ బుక్ లో ఏముంది? మిగిల్ ఎలా తప్పించుకున్నాడు? అసలు మిగిలి కథేంటి? డెజావు ఎక్స్‌పరిమెంట్ ఏంటి? మిగిలి జైలు నుంచి ఎలా తప్పించుకున్నాడు? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.