Thaman : తమన్ అన్న బంగారం.. 12 కోట్లతో ఓల్డ్ ఏజ్ హోమ్.. డొనేషన్స్ వచ్చినా నో చెప్పి..
తాజాగా తమన్ ఓ వృద్ధాశ్రమం కడుతున్నట్టు, దాని గురించి వివరాలను ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. (Thaman)
Thaman
Thaman : మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చిన్న వయసులోనే తండ్రిని పోగొట్టుకొని ఎంతో కష్టపడి సంగీత దర్శకుడిగా ఎదిగాడు. ఇప్పుడు తెలుగు, తమిళ్ పరిశ్రమలలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు. ఓ పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క టీవీ షోలు, క్రికెట్ మ్యాచ్ లతో కూడా బిజీగా ఉన్నాడు. తమన్ కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు గతంలోనే తెలిపాడు.
తాజాగా తమన్ ఓ వృద్ధాశ్రమం కడుతున్నట్టు, దాని గురించి వివరాలను ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.
Also See : Sneha : వరలక్ష్మి వ్రతం.. సాంప్రదాయంగా నటి స్నేహ.. ఫొటోలు..
తమన్ మాట్లాడుతూ.. నేను ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కడుతున్నాను. దాని కోసం ఇప్పటికే 4 కోట్లు ఖర్చుపెట్టాను. మొత్తం నేను అనుకున్నదానికి 12 కోట్లు అవుతుంది. నాకు వచ్చే రెమ్యునరేషన్ కాకుండా కాన్సర్ట్స్ ద్వారా వచ్చే డబ్బులు మొత్తం దానికే ఖర్చుపెడుతున్నాను. నాకు చారిటి చేయడం ఇష్టం. ఎవరికైనా చదువుకోడానికి, ఆపరేషన్స్ కి డబ్బులు ఇస్తూ ఉంటాను. అవన్నీ నా టీమ్ చూసుకుంటుంది. సొసైటీకి ఎంతో కొంత ఇవ్వాలి అని నేను నమ్ముతాను.
నా ఓల్డ్ ఏజ్ హోమ్ పూర్తి చేయడానికి చాలామంది విరాళాలు ఇస్తామంటున్నారు. కొన్ని కార్పొరేట్ కంపెనీలు CSR ఫండ్స్ ద్వారా ఇస్తామంటారు కానీ నేను తీసుకోను. నా సొంత డబ్బులతో నేనే కట్టాలి అనుకుంటున్నాను. నాకు వచ్చే కాన్సర్ట్స్, ఆడే క్రికెట్ మ్యాచ్ లకు వచ్చే డబ్బులు పోగేసి కడుతున్నాను. కొంత టైం పడుతుంది. సినిమాలకు వచ్చే డబ్బులు మాత్రమే నేను తీసుకుంటాను. మిగతా ఏ రూపంలో డబ్బులు వచ్చినా అవి ఓల్డ్ ఏజ్ హోమ్ కే ఖర్చుపెడుతున్నాను అని తెలిపారు. దీంతో మంచి మ్యూజిక్ ఇవ్వడమే కాదు మంచి మనసు ఉన్న బంగారం మా తమన్ అన్న అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
Also See : Ashika Ranganath : ఆషికా అందాలు అదరహో.. అప్పుడే పదేళ్లు.. ఫొటోలు..
