హీరోల ల్యాండ్ మార్క్ మూవీస్ : దేవి సెంటిమెంట్
తమ ల్యాండ్ మార్క్ ఫిలింస్‌కి మ్యూజిక్ చేసే అవకాశం కల్పించిన హీరోలు మరియు దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్ చెప్తూ దేవి శ్రీ ప్రసాద్ ట్వీట్ చేసాడు..
- sekhar
- Published on- May 9, 2019 / 12:05 PM IST
తమ ల్యాండ్ మార్క్ ఫిలింస్‌కి మ్యూజిక్ చేసే అవకాశం కల్పించిన హీరోలు మరియు దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్ చెప్తూ దేవి శ్రీ ప్రసాద్ ట్వీట్ చేసాడు..
దేవి శ్రీ ప్రసాద్.. తెలుగు సినిమా సంగీతాన్ని తన మ్యూజిక్ మ్యాజిక్‌తో కొత్త పుంతలు తొక్కించిన రాక్ స్టార్.. పాట రాయడం, ట్యూన్ కట్టడం, పాట పాడడం, సినిమాలో సందర్భానికి తగ్గట్టు తన బ్యాగ్రౌండ్ స్కోర్‌తో సీన్‌నీ, దాని తాలూకూ ఇంపాక్ట్‌ని హైలెట్ అయ్యేలా చెయ్యడం దేవి స్పెషాలిటీ.. అతని కెరీర్లో ఎన్నో చార్ట్ బస్టర్ సాంగ్స్ ఇచ్చాడు. రీసెంట్గా దేవి చేసిన ట్వీట్ ఒకటి సంగీత ప్రియులను ఆకట్టుకుంటుంది. సాధారణంగా ప్రతి హీరో కెరీర్లో ల్యాండ్ మార్క్ ఫిలింస్ అనేవి ఉంటాయి.
అవి కనక సూపర్ హిట్ అయితే, అవి వాళ్ళ నట ప్రస్థానంలో మెమరబుల్ మూవీస్‌గా మిగిలిపోతాయి.. అలా కొందరి హీరోల ల్యాండ్ మార్క్ ఫిలింస్‌కి డీఎస్పీ మ్యూజిక్ ఇవ్వడం, ఆ సినిమాలు సూపర్ హిట్ అవడం జరిగింది. మెగాస్టార్ కమ్ బ్యాక్ ఫిలిం, చిరంజీవి 150వ సినిమా.. ఖైదీ నంబర్ 150కి దేవి ఇచ్చిన సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. తమిళ స్టార్ హీరో సూర్య 25వ సినిమా యముడుకి మ్యూజిక్ ఇచ్చింది దేవీనే..
అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ 25వ సినిమా నాన్నకు ప్రేమతో మూవీకి దేవి ఇచ్చిన సంగీతం ప్లస్ అవడమే కాక, తారక్ కెరీర్లో బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు 25th ఫిలిం.. మహర్షికి కూడా దేవీనే మ్యూజిక్ డైరెక్టర్.. ఈ సినిమా పాటలకు, ఆర్ఆర్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సందర్భంగా తమ ల్యాండ్ మార్క్ ఫిలింస్‌కి మ్యూజిక్ చేసే అవకాశం కల్పించిన హీరోలు మరియు దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్ చెప్తూ దేవి శ్రీ ప్రసాద్ ట్వీట్ చేసాడు..
