Thandel – Robinhood : నితిన్ వర్సెస్ నాగచైతన్య.. డిసెంబర్‌లో తండేల్‌తో రాబిన్‌ హుడ్ పోటీ..

డిసెంబర్‌లో బాక్స్ ఆఫీస్ వద్ద నితిన్ వర్సెస్ నాగచైతన్య పోటీ కనిపించబోతుంది. తండేల్ అండ్ రాబిన్ హుడ్..

Thandel – Robinhood : నితిన్ వర్సెస్ నాగచైతన్య.. డిసెంబర్‌లో తండేల్‌తో రాబిన్‌ హుడ్ పోటీ..

Naga Chaitanya Thandel Nithiin Robinhood box office fight in december

Thandel – Robinhood : నాగచైతన్య కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ‘తండేల్’. చందూ ముండేటి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. కాగా మొన్నటివరకు ఈ సినిమా దసరా, దీవాళీ సమయంలో వస్తుందని ఇండస్ట్రీలో టాక్ వినిపించింది.

అయితే తాజాగా వినిపిస్తున్న వార్త ఏంటంటే.. ఈ సినిమా దసరా, దీవాళీ రేస్ నుంచి తప్పుకుందట. ఆ సమయంలో రామ్ చరణ్, రజినీకాంత్, ఎన్టీఆర్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడబోతున్నాయి. మరి ఆ సినిమాలతో పోటీ ఎందుకు అనుకున్నారో, లేదా షూటింగ్ ఇంకా పెండింగ్ ఉందో గాని.. ఈ మూవీని డిసెంబర్ లో క్రిస్టమస్ కానుకగా ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు.

Also read : Allu Arjun : అల్లు అర్జున్ సినిమా సీన్స్ రీ క్రియేట్ చేస్తూ.. ‘మేడం సర్ మేడం అంతే’.. బన్నీ ఫ్యాన్స్ కచ్చితంగా చూడాల్సిన సాంగ్..

ఈ సినిమాని డిసెంబర్ 20న రిలీజ్ చేయడానికి మేకర్స్ డేట్ ఫిక్స్ చేసుకున్నారట. త్వరలోనే ఈ తేదీని అఫీషియల్ అనౌన్స్ చేయనున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. కాగా అదే డేట్ నితిన్ ‘రాబిన్ హుడ్’ సినిమా కూడా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద నితిన్ వర్సెస్ నాగచైతన్య పోటీ కనిపించబోతుంది. ఈ రెండు సినిమాలు ఈ ఇద్దరి హీరోలకు ఎంతో ముఖ్యమైనవి.

ప్రస్తుతం వీరిద్దరూ ప్లాప్స్ లో ఉన్నారు. ఒక్క హిట్టు కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఈ రెండు సినిమాలతో వీరిద్దరూ హిట్స్ అందుకుంటారా లేదా చూడాలి. కాగా నితిన్ రాబిన్ హుడ్ ని వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అనేది ఇప్పటివరకు తెలియజేయలేదు.