Vrushakarma : నాగచైతన్య ‘వృషకర్మ’.. వామ్మో నాన్ థియేట్రికల్ బిజినెస్ ఎన్ని కోట్లకు అమ్ముడయిందో తెలుసా?
ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ తో ఇదేదో కొత్తగా వర్కౌట్ అయ్యేలా ఉందే అని అంచనాలు నెలకొన్నాయి. (Vrushakarma)
Vrushakarma
Vrushakarma : అక్కినేని నాగచైతన్య గత సంవత్సరం తండేల్ సినిమాతో మంచి విజయం సాధించాడు. వంద కోట్ల గ్రాస్ వసూలు చేసాడు. ఆ తర్వాత విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండుతో మిస్టీరికల్ థ్రిల్లర్ వృషకర్మ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్ తో ఇదేదో కొత్తగా వర్కౌట్ అయ్యేలా ఉందే అని అంచనాలు నెలకొన్నాయి.
తాజాగా ఈ సినిమా నాన్ థియేటరికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడవడం టాలీవుడ్ లో చర్చగా మారింది. వృషకర్మ సినిమా ఓటీటీ, శాటిలైట్ రైట్స్ అన్ని కలిపి జీ5 సంస్థ దాదాపు 35 కోట్లకు కొనుక్కుందని సమాచారం. అయితే ఈ సినిమా థియేట్రికల్ గా పెద్ద హిట్ అయి 150 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తే ఓటీటీ రైట్స్ కి మరో 15 కోట్ల వరకు అదనంగా ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారట.
Also Read : Toxic : వాట్.. ‘టాక్సిక్’ అడల్ట్ సినిమా కాదా? బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ సినిమానా? యశ్ ఏం చెప్పాడంటే..
దీంతో వృషకర్మకు నాన్ థియేటరికల్ ఆల్మోస్ట్ 50 కోట్ల వరకు బిజినెస్ అయిందని తెలుస్తుంది. ఈ సినిమాపై ఉన్న అంచనాలతో థియేట్రికల్ బిజినెస్ కూడా భారీగానే జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించకపోయినా డిసెంబర్ లో రిలీజ్ అవుతుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది.
